
సాక్షి, తిరుపతి: స్వర్ణముఖి నదిలో నలుగురు చిన్నారులు గల్లంతవ్వగా, ఒకరిని స్థానికులు రక్షించారు. గల్లంతైన మరో ముగ్గురు ధోని(17), గణేష్(15), యుగంధర్(14) కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నికిత్ సాయి అనే బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. రేణిగుంట మండలం జీ పాలెం వద్ద ఘటన చోటుచేసుకుంది. హరిజనవాడకు చెందిన చిన్నారులుగా గుర్తించారు.
చదవండి: స్నేహితుడి భార్యతో వివాహేతర సంబంధం.. చివరికి..
ఘటనపై మంత్రి పెద్దిరెడ్డి ఆరా..
చిన్నారుల గల్లంతుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరా తీశారు. ఇంఛార్జ్ కలెక్టర్, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేతో మాట్లాడారు. గల్లంతయిన చిన్నారులను రక్షించేందుకు తక్షణం గజ ఈతగాళ్లను రంగంలోకి దించాలని మంత్రి ఆదేశించారు. ఘటనపై సీఎంఓ కార్యాలయం వివరాలు సేకరించింది. సంఘటన స్థలానికి చేరుకున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.. ముగ్గురు యువకులు గల్లంతు కావడం బాధాకరమన్నారు. గల్లంతైన వారి కోసం ప్రత్యేక బలగాలు పిలిచామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment