హోలీ వేడుకల్లో అపశ్రుతి | Two youth drowned to death in holy celebrations | Sakshi
Sakshi News home page

హోలీ వేడుకల్లో అపశ్రుతి

Published Sun, Mar 12 2017 1:50 PM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM

Two youth drowned to death in holy celebrations

భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హోలీ సంబరాల్లో మునిగితేలిన ఇద్దరు యువకులు రంగులు కడుక్కోవడానికి గోదావరిలో దిగి నీట మునిగి గల్లంతయ్యారు. స్థానిక సాయి డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న మొరాంపూడి రాంప్రసాద్‌(19), బోటా రమేష్‌(19) స్నేహితులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం స్నానం చేయడానికి గోదావరికి వెళ్లిన యువకులు ప్రమాదవశాత్తు నీట మునిగి గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇద్దరు యువకుల బంధువుల రోదనలతో గోదావరి తీరం ఉద్వేగంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement