
సాక్షి, నిజామాబాద్: స్నేహితుల దినోత్సవం రోజున విషాదం చోటు చేసుకుంది. పోచంపాడు బ్యాక్‌వాటర్‌లో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు. నందిపేట్ మండలం జిజి నడ్కూడ శివారులో ఘటన జరిగింది. మృతులను అర్సపల్లికి చెందిన యువకులుగా గుర్తించారు. గల్లంతైన మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.