Pochampadu Project
-
Weekend Tourist Spot: గోదావరి తీరం.. శ్రీరాముడి విహారం..
ఈ ఊరిపేరు పోచంపాడు. శ్రీరాముడు వనవాసకాలంలో ఇక్కడ సంచరించాడని స్థానికుల విశ్వాసం. అందుకే పోచంపాడులో నిర్మించిన ప్రాజెక్టు శ్రీరామ్సాగర్గా పేరు తెచ్చుకుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్‌సాగర్... చక్కటి వీకెండ్ హాలిడే స్పాట్. పిల్లల కేరింతలు, పెద్దవాళ్ల తాదాత్మ్యతతో ఈ టూర్ పరిపూర్ణమవుతుంది. మహాగమనం మహారాష్ట్రలో పుట్టిన గోదావరి గైక్వాడ్, విష్ణుపురి, బాబ్లీ ప్రాజెక్టులను దాటుకుని తెలంగాణలో అడుగుపెట్టి నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుతో వేగానికి కళ్లెం వేసుకుంటుంది. పర్యాటకులను అలరిస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మల్, జగిత్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలకు తాగునీరు, సాగునీటికి ప్రధాన ఆధారం. పుష్కర సాగర్ పోచంపాడు గోదావరి నది పుష్కరాలకు కూడా ప్రసిద్ధి. గడచిన పుష్కరాలలో రోజుకు ఐదు నుంచి ఎనిమిది లక్షల మంది నదిలో స్నానమాచరించారు. పుష్కరాలతో ప్రమేయం లేకుండా నదిస్నానం కోసం పర్యాటకులు ప్రతి శుక్రవారం, ఇతర సెలవు దినాల్లో ఎక్కువగా వస్తారు. భవిష్యత్తులో బోటు షికారు శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులో బోటింగ్ పాయింట్‌ను ఏర్పాటు చేసి బాసర వరకు బోట్లు నడపాలని తెలంగాణ టూరిజం నిర్ణయించింది. శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు నుంచి బాసరకు దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరం. ఇంతదూరం బోటు షికారు చేయడం పర్యాటకులకు అంతులేని ఆనందాన్నిస్తుందనడంలో సందేహం లేదు. టూరిజం కార్పొరేషన్ ఏర్పాట్లు చేస్తోంది. త్యాగచరిత 1963 జూలై 26న అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ పోచంపాడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 1978కి ప్రాజెక్టు పూర్తయింది. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ, నందిపేట్, నవీపేట్, ఆర్మూర్, నిర్మల్ జిల్లాలోని లోకేశ్వరం, దిలావర్పూర్, నిర్మల్ మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు వ్యవసాయ భూములు, ఇళ్లను త్యాగం చేయడంతో శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టు జీవం పోసుకుంది. ఎంతెంత దూరం! ఎలా వెళ్లాలి! శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జాతీయ రహదారి 44కు మూడు కి.మీ దూరంలో ఉంది. నిజామాబాద్ నుంచి నిర్మల్ వెళ్లే బస్సులు పోచంపాడు∙మీదుగా వెళ్తాయి. ఆదిలాబాద్, నిర్మల్ నుంచి నిజామాబాద్, హైదరాబాద్‌కు వెళ్లే బస్సులన్నీ పోచంపాడు మీదుగానే ప్రయాణిస్తాయి. పోచంపాడు... హైదరాబాద్ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో, నిజామాబాద్‌కు 50 కిలోమీటర్లలో, నిర్మల్ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. – చంద్రశేఖర్, భద్రారెడ్డి, సాక్షి, నిజామాబాద్ చదవండి: Wonder of Science: బాప్రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!! -
స్నేహితుల దినోత్సవం రోజున విషాదం..
సాక్షి, నిజామాబాద్: స్నేహితుల దినోత్సవం రోజున విషాదం చోటు చేసుకుంది. పోచంపాడు బ్యాక్‌వాటర్‌లో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు. ముగ్గురు మృతి చెందగా, మరో ఇద్దరిని స్థానికులు కాపాడారు. నందిపేట్ మండలం జిజి నడ్కూడ శివారులో ఘటన జరిగింది. మృతులను అర్సపల్లికి చెందిన యువకులుగా గుర్తించారు. గల్లంతైన మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
‘రాష్ట్రంలో రాచరిక పాలన’
సాక్షి, జగిత్యాల : ప్రజలపై అణచివేత ధోరణి ఉంటే ప్రభుత్వానికి వినాశనం తప్పదని కాంగ్రెస్‌పక్ష ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సాగునీటి కోసం శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్యంలో ‘ఛలో పోచంపాడు’ కార్యక్రమాన్ని చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముందుస్తుగానే కాంగ్రెస్ నేతలను, రైతు సంఘల నేతలను అరెస్ట్ చేశారు. దీనిపై జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తోందని, ప్రజల హక్కుల కోసం పోరాడం చేస్తున్న నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతమున్న నీటిలో ఐదు టీఎంసీలు వాడుకునే అవకాశం ఉందని, దానిలో ఒక్క టీఎంసీ సాగుకోసం విడుదల చేయవచ్చునని తెలిపారు. రైతుల న్యాయమైన డిమాండ్‌కు తెలంగాణ సర్కార్ పట్టించుకోవడంలేదని విమర్శించారు. కాగా శ్రీరాం సాగర్ నీటి విడుదల కోసం గత వారం రోజులుగా రైతుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. -
'తెలంగాణ రావడంవల్లే పోచంపాడు'
పోచంపాడు: తెలంగాణ వచ్చింది కాబట్టే పోచంపాడు ప్రాజెక్టు వచ్చిందని నీటి పారుదలశాఖమంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పునరుజ్జీవ ప్రాజెక్టు కర్త, క్రియ, రూపకర్త సీఎం కేసీఆరే అన్నారు. పోచంపాడులో గురువారం మధ్యాహ్నం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. అతి తక్కువ ముంపు, అతి తక్కువ ఖర్చుతో అతి ఎక్కువ ఆయకట్టుకు నీళ్లు అందించే ప్రాజెక్టు పోచంపాడు అని హరీశ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు వచ్చిందంటే రైతులకు ప్రాణం పోసినట్టే అన్నారు. సీఎం కేసీఆర్ రైతాంగాన్ని ఆదుకున్నారన్నారు. వరద కాలువను రిజర్వాయర్‌గా మార్చి రైతులకు రెండు పంటలు నీళ్లు అందిస్తున్న ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. కట్టిన ప్రాజెక్టులను ఎలా కాపాడాలో ఎన్నడూ కాంగ్రెస్ వాళ్లు ఆలోచించలేదన్నారు. రీడిజైన్ ద్వారా కేసీఆర్ ప్రాజెక్టులకు పునర్జీవం ఇచ్చారన్నారు. 40 డిగ్రీల ఎండలో ఇంత పెద్ద ఎత్తున ప్రజలు రావడం సీఎం మీద మీకున్న భరోసా తెలుస్తుందని హరీశ్ అన్నారు. గోదారి నీళ్ళతో ఎస్సారెస్సీ ఆయకట్టు సస్యశ్యామలం అవుతుందని హరీశ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 12 నెలల్లో ఎస్సారెస్సీ పనులు పూర్తి చేస్తామన్నారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ముంపుకు గురైన గ్రామస్థులకు తగిన సాయం చేస్తామని మంత్రి తెలిపారు. పనిచేయకపోయినా లిఫ్ట్ ఇరిగేషన్ మళ్లీ పనిచేసే అవకాశాలున్నాయన్నారు. అన్ని ప్రాజెక్టులు కళకళలాడుతాయన్నారు. సీఎం తీసుకున్న నిర్ణయం చరిత్రలో ఎవరూ సాధించనటువంటి నిర్ణయమన్నారు. -
పోచారం అభయారణ్యానికి పూర్వవైభవం
నాగిరెడ్డిపేట :నిజామాబాద్-మెదక్ జిల్లాల సరిహద్దులో గల పోచా రం అభయారణ్యంతోపాటు, పోచారం ప్రాజెక్టుకు పూర్వవైభవం తీసుకొస్తామని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామ న్న అన్నారు. అభయారణ్యం వద్ద పర్యావరణ విద్యాకేంద్రా న్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రెండు జిల్లా సరిహద్దులో ఉన్న పోచారం అభయారణ్యాన్ని శనివారం శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. అభయారణ్యంలో తిరుగుతూ జింకలను, నెమళ్లను, దుప్పిలను, మనుబోతులను వారు తిలకించారు. చాలా దూరం కాలినడకన తిరిగారు. అభయారణ్యం లోని జంతువుల గురించి ఫారెస్ట్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోచారం ప్రాజెక్టును వారు సందర్శిం చారు. ప్రాజెక్టు వద్ద ఉన్న నిజామాబాద్, మెదక్ జిల్లా అతి థిగృహాలను పరిశీలించారు. వాటికి మరమ్మతులు చేపడతామన్నారు. ఏడుపాయల, మెదక్ చర్చి, పోచారం అభయారణ్యం, పోచారం ప్రాజెక్టులను కలిపి పర్యాటక ప్రాంతాలుగా మారుస్తామని చెప్పారు. పర్యావరణ విద్య కేంద్రం పోచారం అభయారణ్యం వద్ద పర్యావరణవిద్య కేంద్రాన్ని(ఎన్విరాల్మెంట్ ఎడ్యూకేషన్ సెంటర్) ఏర్పాటు చే స్తామని అటవీశాఖ, వెనుకబడిన తరగతుల మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. అభయారణ్యాన్ని సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అటవీశాఖలో ఖాళీగా ఉన్న 2,600 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9 వన్యప్రాణికేంద్రాలు ఉన్నాయన్నారు. పోచారం అభయారణ్యంలో స్థాయికి మించి జంతువుల సంఖ్య పెరిగిందని, ఎక్కువగా ఉన్న జంతువులను ఇతర వన్యప్రాణి కేంద్రాలకు తరలిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి సహకారంతో అడవులను, వన్యప్రాణులను సంరక్షించుకునేలా చర్యలు చేపడతామన్నారు. అభయారణ్యంతోపాటు ప్రాజెక్టును తిలకించేందుకు వచ్చే పర్యాటకులకు ఇబ్బందులు కలుగకుండా హరిత హోటల్‌ను ఏర్పాటు చేయిస్తామని ఆయన చెప్పారు. వారి వెంట మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్‌బొజ్జా, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జనార్ధన్‌గౌడ్ తదితరులు ఉన్నారు.