జీవన్ రెడ్డి (ఫైల్ ఫోటో)
సాక్షి, జగిత్యాల : ప్రజలపై అణచివేత ధోరణి ఉంటే ప్రభుత్వానికి వినాశనం తప్పదని కాంగ్రెస్‌పక్ష ఉపనేత, జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సాగునీటి కోసం శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్యర్యంలో ‘ఛలో పోచంపాడు’ కార్యక్రమాన్ని చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ముందుస్తుగానే కాంగ్రెస్ నేతలను, రైతు సంఘల నేతలను అరెస్ట్ చేశారు. దీనిపై జీవన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తోందని, ప్రజల హక్కుల కోసం పోరాడం చేస్తున్న నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు.
ఎస్సారెస్పీలో ప్రస్తుతమున్న నీటిలో ఐదు టీఎంసీలు వాడుకునే అవకాశం ఉందని, దానిలో ఒక్క టీఎంసీ సాగుకోసం విడుదల చేయవచ్చునని తెలిపారు. రైతుల న్యాయమైన డిమాండ్‌కు తెలంగాణ సర్కార్ పట్టించుకోవడంలేదని విమర్శించారు. కాగా శ్రీరాం సాగర్ నీటి విడుదల కోసం గత వారం రోజులుగా రైతుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment