
సాక్షి, గురజాల రూరల్: వేసవి సెలవుల్లో ఆనందంగా క్రికెట్ ఆడుకుంటున్న ముగ్గురు విద్యార్థులు పిడుగుపాటుకు గురై మృత్యువాత పడ్డారు. గుంటూరు జిల్లా గురజాల మండలం సమాధానంపేటకు చెందిన శ్రీహరి నాయక్, మనోహర్ నాయక్, హరిబాబు నాయక్‌తో పాటు మరికొందరు పొలాల్లో క్రికెట్ ఆడుతున్నారు. అకస్మాత్తుగా ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు రావడంతో పరుగులు తీశారు. ఇంతలో మూడావత్ పవన్ (17), శ్రీహరి నాయక్(14), మనోహర్ నాయక్ (11)లకు సమీపంలో పిడుగు పడడంతో ముగ్గురూ అక్కడికక్కడే మృతిచెందారు.
హరిబాబు నాయక్ కొద్ది దూరంలో స్పృహ కోల్పోయాడు. స్థానికులు వీరిని రెంటచింతల ప్రైవేటు వైద్యశాలకు తరలించగా ముగ్గురు అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు. హరిబాబు నాయక్ గురజాల ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతుల్లో పవన్ హైదరాబాద్‌లో చదువుకుంటూ 10 రోజుల కిందటే వేసవి సెలవులకు సమాధానంపేటలోని మేనమామ నరసింహా నాయక్ ఇంటికి వచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment