కారును ఢీకొట్టిన లారీ.. ముగ్గురు మృతి | Three Persons Killed In Badvel Road Accident | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 1 2018 7:18 AM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

Three Persons Killed In Badvel Road Accident - Sakshi

సాక్షి, కడప : జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటన జిల్లాలోని బద్వేలు మున్సిపాలిటీ మడలకవారిపల్లె సుదర్శన ఆశ్రమం వద్ద జరిగింది. మృతులు అనంతపురంలోని మారుతి నగర్‌కు చెందిన వారిగా గుర్తించారు. వివరాలివి.. వెంకటరామిరెడ్డి, సుజాత దంపతులు. వీరు కారులో నెల్లూరులో ఓ వివాహ వేడుకకు వెళుతూ మృత్యువాతపడ్డారు. 

ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలల ప్రాంతంలో జరిగినట్లు సమాచారం. ప్రమాదంలో కారు నుజ్జునుజయింది. కారు నెంబర్ Ka 05mv 6549‌. ఈ ప్రమాదంలో దంపతులతో పాటు, డ్రైవర్‌ మధు అక్కడిక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘట స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement