- ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి విషమం
చెన్నూరు(వైఎస్సార్ జిల్లా)
వైఎస్సార్ జిల్లా చెన్నూరు సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆర్టీసీ బస్సు- లారీ ఢీకొనడంతో డ్రైవర్లిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. సూపర్‌లగ్జరీ బస్సు కర్నూలు నుంచి తిరుపతికి వెళుతుండగా, చెన్నై నుంచి కర్నూలు వైపు వస్తున్న లారీ ఢీకొంది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు డ్రైవర్ల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వారిని కడప రిమ్స్‌కు తరలించారు. బస్సులోని నలుగురైదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. మరో బస్సులో వారిని తిరుపతికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సు- లారీ ఢీ..
Published Sun, Apr 3 2016 2:26 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
Advertisement
Advertisement