మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం నాటెల్లి వద్ద గురువారం అర్ధరాత్రి తర్వాత ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
కొత్తకోట: మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం నాటెల్లి వద్ద గురువారం అర్ధరాత్రి తర్వాత ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొత్త కోట నుంచి పెబ్బేరు వైపు బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మృతులను కొత్తకోటకు చెందిన నాని (18), శరత్ (29), హరీష్ (20)లుగా గుర్తించారు. అతి వేగంతో ముందున్న ఓ వాహనాన్ని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి ముగ్గురూ ప్రమాద స్థలంలోనే మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. ముగ్గురు స్నేహితులు మృతి చెందడంతో కొత్తకోటలో విషాదచాయలు అలుముకున్నాయి.