ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు మందుపాతర పేల్చారు.
ఛత్తీస్‌గఢ్ : ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి మందుపాతర పేల్చారు. నారాయణపూర్ జిల్లా తుంనార్ వద్ద బుధవారం రాత్రి భద్రతా బలగాలే లక్ష్యంగా అత్యంత ప్రమాదకరమైన ఐఈడీ(ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్)ని పేల్చారు.
ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా నలుగురికి తీవ్ర గాయాలైనట్లు ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామన్నారు. మృతి చెందిన వారిలో 15 ఏళ్ల బాలిక, ఇద్దరు మహిళలు ఉండగా, మరో నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారని ఎస్పీ చెప్పారు.