సాక్షి, ముంబై: ఠాణే జిల్లా దౌడీ గ్రామం సమీపంలోని కల్యాణ్‌శీల్ వద్ద గోదాములో శుక్రవారం జరిగిన పేలుడు ఘట నలో ముగ్గురు మృతిచెందారు. ఉదయం 9.30 గంటల సమయంలో గోదాములో నిలిపిఉంచిన పాత రసాయన ట్యాంకర్‌ను గ్యాస్‌కట్టర్‌తో కోస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను విజయ్ అగ్రహారి, కైలాష్, శివప్రసాద్‌లుగా గుర్తిం చారు. ఈ గోదాములో అనుమతి లేకుండా పాత ర సాయన ట్యాంకర్‌లను కోసి తుక్కు సామాను కింద విక్రయిస్తున్నట్టు సమాచారం. రసాయన ట్యాంకర్ దాదాపు ఐదు వేల కిలోల బరువున్నప్పటికీ పేలు డు తీవ్రత కారణంగా దాదాపు 300 మీటర్ల ఎత్తుమేర ఎగిరి కింద పడింది. పేలుడు ధాటికి తునాతునకలైన ట్యాంకర్‌కు చెందిన ఇనుపముక్కలు పడడంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి.
ఈ ఘటనతో ఈ గోదాముకు సమీపంలో నివసించేవారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ సమాచారం అందగానే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఘటనాస్థలికి చేరువలో నివసిస్తున్న తెలుగువారైన సతీష్, ములుగు నర్సయ్య (మెదక్ జిల్లా వాసులు)ల ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. మరికొందరి ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
ట్యాంకర్ పేలి ముగ్గురి మృతి
Published Fri, Dec 6 2013 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 1:20 AM
Advertisement