boiler explosion
-
తమిళనాడు: బాయిలర్ పేలి ఐదుగురు మృతి
చెన్నె : తమిళనాడులో బుధవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. కడలూరు జిల్లాలోని కేంద్ర ఆధారిత థర్మల్ పవర్‌ప్లాంట్ నైవెల్లి లిగ్నైట్ ప్లాంట్‌లోని రెండవ దశ బాయిలర్‌లో బుధవారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడ్డవారిని ఎన్ఎల్సీ లిగ్నైట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి పేలుడు సంభవించిన బాయిలర్ ఆపరేషన్ నిలిపివేసామని అధికారులు తెలిపారు. గత రెండు నెలల కాలంలో నైవెల్లి లిగ్నైట్ ప్లాంట్‌లో పేలుడు చోటుచేసుకోవడం ఇది రెండోసారి. ఇంతకుముందు మే నెలలో ప్లాంట్‌లోని బాయిలర్ పేలడంతో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. -
ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: ఐదుగురు మృతి
గాంధీనగర్: గుజరాత్‌లోని ఓ రసాయన ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం మధ్యాహ్నం దాహెజ్ పారిశ్రామిక వాడలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలుళ్లు సంభవించడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. ఫ్యాక్టరీ మొత్తాన్ని మంటలు దహించివేస్తుండటంతో చుట్టు పక్కల ప్రాంతాల్లోనూ దట్టమైన నల్లటి పొగలు కమ్ముకున్నాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించగా, పరిశ్రమలో పనిచేసే సుమారు 40 మంది సిబ్బంది గాయాలపాలైనట్లు బరూచ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పేర్కొన్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని అగ్నికీలలను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. (కళ్ల ముందే కష్టం బూడిద) మరోవైపు అధికారులు ముందస్తు జాగ్రత్తగా పరిసర గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనపై బరూచ్ జిల్లా కలెక్టర్ ఎండీ మోడియా మాట్లాడుతూ.. నేడు మధ్యాహ్నం అగ్రో కెమికల్ కంపెనీలో బాయిలర్ పేలుళ్లు సంభవించాయని తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కాగా సోషల్ మీడియాలోనూ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. (భారీ అగ్ని ప్రమాదం: ఏడుగురు సజీవ దహనం) -
విశాఖ ఘటన మరువక ముందే మరో ప్రమాదం
చెన్నై: లాక్డౌన్ కారణంగా చాలా కాలం తరువాత పరిశ్రమలు ప్రారంభించడంతో గురువారం ఒక్కరోజే దేశవ్యాప్తంగా అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. విశాఖలో జరిగిన యల్‌జీ గ్యాస్ లీకేజీ మరువక ముందే చత్తీస్‌ఘర్ లోని పేపర్ మిల్లులో గ్యాస్ లీక్ అయ్యి ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. ఇప్పుడు తాజాగా తమిళనాడులోని కడలూరు కోల్ మైనింగ్ కంపెనీలో బాయిలర్ పేలి ఏడుగురు గాయాలపాలయ్యారు.(మృత్యుపాశమై వెంటాడిన విషవాయువు) ఈ ఘటన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ప్లాంటులో చోటుచేసుకుంది. తమిళనాడు పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెస్తున్నారు. గాయపడిన వారికి దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఒకే రోజు వరుసగా ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడంతో దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. (మరో గ్యాస్ లీకేజీ ఘటన.. ఏడుగురికి అస్వస్థత) -
బాయిలర్ పేలుడు: నలుగురికి గాయాలు
దామరచర్ల: నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వాడిపల్లి వద్ద నున్న ఇండియా సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తూ బాయిలర్ పేలి నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ట్యాంకర్ పేలి ముగ్గురి మృతి
సాక్షి, ముంబై: ఠాణే జిల్లా దౌడీ గ్రామం సమీపంలోని కల్యాణ్‌శీల్ వద్ద గోదాములో శుక్రవారం జరిగిన పేలుడు ఘట నలో ముగ్గురు మృతిచెందారు. ఉదయం 9.30 గంటల సమయంలో గోదాములో నిలిపిఉంచిన పాత రసాయన ట్యాంకర్‌ను గ్యాస్‌కట్టర్‌తో కోస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను విజయ్ అగ్రహారి, కైలాష్, శివప్రసాద్‌లుగా గుర్తిం చారు. ఈ గోదాములో అనుమతి లేకుండా పాత ర సాయన ట్యాంకర్లను కోసి తుక్కు సామాను కింద విక్రయిస్తున్నట్టు సమాచారం. రసాయన ట్యాంకర్ దాదాపు ఐదు వేల కిలోల బరువున్నప్పటికీ పేలు డు తీవ్రత కారణంగా దాదాపు 300 మీటర్ల ఎత్తుమేర ఎగిరి కింద పడింది. పేలుడు ధాటికి తునాతునకలైన ట్యాంకర్‌కు చెందిన ఇనుపముక్కలు పడడంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనతో ఈ గోదాముకు సమీపంలో నివసించేవారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ సమాచారం అందగానే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఘటనాస్థలికి చేరువలో నివసిస్తున్న తెలుగువారైన సతీష్, ములుగు నర్సయ్య (మెదక్ జిల్లా వాసులు)ల ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. మరికొందరి ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.