
చెన్నె : తమిళనాడులో బుధవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. కడలూరు జిల్లాలోని కేంద్ర ఆధారిత థర్మల్ పవర్‌ప్లాంట్ నైవెల్లి లిగ్నైట్ ప్లాంట్‌లోని రెండవ దశ బాయిలర్‌లో బుధవారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడ్డవారిని ఎన్ఎల్‌సీ లిగ్నైట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి పేలుడు సంభవించిన బాయిలర్ ఆపరేషన్ నిలిపివేసామని అధికారులు తెలిపారు. గత రెండు నెలల కాలంలో నైవెల్లి లిగ్నైట్ ప్లాంట్‌లో పేలుడు చోటుచేసుకోవడం ఇది రెండోసారి. ఇంతకుముందు మే నెలలో ప్లాంట్‌లోని బాయిలర్ పేలడంతో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.