Cuddalore district
-
మూడోసారి ఆడపిల్లేనని.. గర్భస్రావానికి మాత్రలు మింగిన యువతి మృతి
సాక్షి, చెన్నై: మూడోసారి గర్భంలోనూ ఆడపిల్లే ఉందన్న బాధతో ఓ యువతి గర్భస్రావం చేసు కోవడానికి మాత్రలు మింగడంతో మృతి చెందింది. పోలీసుల కథనం మేరకు.. కడలూరు జిల్లా వేపూర్ సమీపంలోని కీళకురిచ్చి గ్రామానికి చెందిన గోవిందరాజ్, అముద (27) దంపతులు. వీరికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అముద మూడోసారి గర్భం దాల్చింది. కడుపులో ఉన్న బిడ్డ మగబిడ్డా, ఆడబిడ్డా అని అముద తెలుసుకోవాలనుకుంది. దీనికి సంబంధించి పరీక్షలు చేయించుకునేందుకు గత 17వ తేదీ అముద కల్లకురిచ్చి జిల్లా అసకలత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ ఉన్న ఆస్పత్రి యజమాని, అముద కడుపుని స్కాన్ చేసి, ఆమె ఆడపిల్లను మోస్తున్నట్లు చెప్పింది. మూడోసారి ఆడబిడ్డకు జన్మనివ్వడానికి ఇష్టం లేని అముద అబార్షన్ చేయమని కోరింది. ఆ తర్వాత అముదకు అదే ఫార్మసీలో అబార్షన్ మాత్రలు ఇచ్చారు. వాటిని తిన్న తర్వాత వేపూర్ సమీపంలోని నిరామణిలో ఉన్న తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. 2 రోజులు అక్కడే ఉన్న ఆమెకు శనివారం సాయంత్రం తీవ్ర రక్తస్రావం అయింది. కొద్దిసేపటికి స్పృహతప్పి పడిపోయింది. దిగ్భ్రాంతి చెందిన తల్లిదండ్రులు, బంధువులు వెంటనే అముదను చికిత్స నిమిత్తం వేపూర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు అముద అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటన గురించి వేపూర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ప్రభుత్వ టీచర్‌గా హిజ్రా.. చదువుపై ఇష్టంతో.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. -
తమిళనాడులో మరో విద్యార్థిని ఆత్మహత్య.. రెండు వారాల్లో మూడో ఘటన
సాక్షి, చెన్నై: తమిళనాడులో విద్యార్థినుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. జూలై 13న కల్లకురిచ్చి జిల్లాలో 17 ఏళ్ల విద్యార్థిని హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. నిన్నటికి నిన్న (సోమవారం) తిరువళ్లూరులోని ప్రభుత్వ పాఠశాల హాస్టల్ గదిలో 12వ తరగతి విద్యార్థిని ఉరేసుకొని విగత జీవిగా కనిపించింది. ఇక ఈ ఘటన జరిగి 24 గంటలు గడవక ముందే తాజాగా మరో మైనర్ విద్యార్థిని అసువులు బాసింది. కడలూరు జిల్లాలో 12వ విద్యార్థినిని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. రెండు వారాల్లో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం ఇది మూడోసారి.. బాధితురాలి నుంచి నాలుగు పేజీల సుసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేశారు. అందులో తను ఐఏఎస్ కావాలన్న తల్లిదండ్రుల కోరికను నెరవేర్చలేకపోతున్నాని వాపోయింది. కాగా విద్యార్థిని తల్లిదండ్రులు వ్యవసాయ దారులు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండానే మృతురాలికి అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు సిద్ధమవుతుండగా.. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు జిల్లా పోలీసు అధికారి శక్తి గణేషన్ తెలిపారు. చదవండి: తమిళనాడులో ఘోరం.. విద్యార్థిని ఆత్మహత్య.. 10 రోజుల్లో రెండో ఘటన ఇదిలా ఉండగా తొలుత కాళ్లకురిచ్చి జిల్లా చిన్న సేలం సమీపంలోని కన్నియమూరు గ్రామంలో ఓ ప్రైవేటు ఇంటర్నేషనల్ స్కూల్లో ప్లస్-2 చదువుతున్న శ్రీమతి (17) అనే బాలిక హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆ విద్యార్థిని బంధువులు, స్థానిక ప్రజలు నిరసన తెలిపారు. స్కూల్‌పై దాడిచేశారు. ఈ వ్యవహారం కోర్టుకు కూడా వెళ్లింది. దీంతో విద్యా సంస్థల్లో జరగుతున్న మరణాలపై సెంట్రల్ బ్యూరో సీఐడీతో విచారణ జరిపించాలని మద్రాస్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సోమవారం విద్యార్థిని ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు సెంట్రల్ బ్యూరో సీఐడీకి బదిలీ చేశారు. ఇదే కాక జూలై 13న కళ్లకురిచ్చి జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని కేసు కూడా విచారణ జరుపుతోంది. రాష్ట్రంలో విద్యార్ధినిల ఆత్మహత్యలపై సీఎంస్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినులు ఆత్మహత్య ఆలోచనలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. పరీక్షలను విజయాలుగా మార్చుకోవాలని సూచించారు. విద్యార్థులపై లైంగిక, మానసిక, శారీరక వేధింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
Tamil Nadu: దీవిని తలపిస్తున్న కడలూరు.. ఎటు చూసినా నీరే
రాష్ట్రాన్ని భారీ వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. కుంటల నుంచి జలాశయాల వరకు అన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. రోడ్లు, పంట పొలాల్లో నీరు నిల్వ ఉండడంతో వాహనదారులు, రైతులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే గత నాలుగు రోజులుగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లలోకి నీరు చేరి అల్లాడుతున్నారు. రవాణా వ్యవస్థ దెబ్బతినడంతో నిత్యావసరాల ధరలకు రెక్కలొచ్చాయి. ఇక సీఎం స్టాలిన్ సహా.. మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు సహాయక చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. విపక్ష నాయకులు సైతం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. సాక్షి, చెన్నై: ఏటా ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటున్న ప్రాంతం కడలూరు. ఈ ఏడాదీ ఇక్కడి ప్రజల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి ప్రస్తుతం కడలూరు దీవిని తలపిస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే చాలు అది రాష్ట్రం వైపుగా చొచ్చుకు వస్తుందంటే, అది కడలూరు సమీపంలో తీరం దాటాల్సిందే. ఇది ఏళ్ల తరబడి సాగుతూ వస్తున్న పరిణామం. ప్రస్తుతం కూడా ఇక్కడి ప్రజల్ని వాయుగుండం వెంటాడుతోంది. ఇక్కడున్న ఆరు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. 300 చెరువులు 75 శాతానికి పైగా నిండి ఉన్నాయి. చదవండి: భారీ వర్షాలు: 15 జిల్లాలకు రెడ్ అలెర్ట్.. నీటి పరవళ్లతో పంట పొలాలు, రోడ్లు కనిపించని పరిస్థితి. ఎటు చూసినా నీరే అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇక్కడి ఎన్ఎల్సీ లిగ్నైట్ కార్పొరేషన్‌లోని బొగ్గు గనుల నుంచి వెలువడే నీటికి వరదలు తోడయ్యాయి. దీంతో పరిసర గ్రామాల మధ్య సంబంధాలు కరువైనట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. విల్లుపురం, కళ్లకురిచ్చి, నాగపట్నం జిల్లాల నుంచి సైతం వరదలు ఇటు వైపుగా పోటెత్తుతుండంతో సాయం కోసం కడలూరు వాసు లు ఎదురు చూడాల్సిన పరిస్థితి. ఇక డెల్లా జిల్లాల్లో సంబా పంటపై వరుణుడు ప్రతాపం చూపుతున్నా డు. పుదుకోట్టై, తిరువారూర్, తంజావూరు జిల్లాల్లో వరి పంటను ముంచేస్తూ వరదలు పోటెత్తుతుండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. చదవండి: హ్యాట్సాఫ్ మేడమ్!.. యువకుడిని భుజాలపై మోసుకెళ్లిన మహిళా పోలీస్ Tamil nadu government kindly do the drainage system properly #TamilNaduRains #Velachery pic.twitter.com/RnNeef6KS8 — Abhimanyu Kumar (@themanukumar) November 11, 2021 #WATCH Areas in Chennai's Ashok Nagar remain inundated as rainfall continues to lash the city. As per the Met Department, Chennai is expected to receive heavy rainfall today. #TamilNadu pic.twitter.com/0iyNoVfnrY — ANI (@ANI) November 11, 2021 River #Sweta at V.Kalathur Site in #Cuddalore district in #TamilNadu pic.twitter.com/W84EiSBETp — Central Water Commission Official Flood Forecast (@CWCOfficial_FF) November 3, 2021 -
విషాదం: పేలిన బాయిలర్.. నలుగురు కార్మికులు దుర్మరణం
తమిళనాడు: కడలూర్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా ఉండే ఓ కెమికల్ కంపెనీలో బాయిలర్ పేలింది. పేలుడు ధాటికి నలుగురు కార్మికులు మృతి చెందారు. 10 మందికి పైగా గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స కోసం పోలీసులు కడలూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఫ్యాక్టరీ నిర్వహణ నిబంధనలకు అనుగుణంగా ఉందా, లేదంటే అక్రమంగా ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. -
తమిళనాడు: బాయిలర్ పేలి ఐదుగురు మృతి
చెన్నె : తమిళనాడులో బుధవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. కడలూరు జిల్లాలోని కేంద్ర ఆధారిత థర్మల్ పవర్‌ప్లాంట్ నైవెల్లి లిగ్నైట్ ప్లాంట్‌లోని రెండవ దశ బాయిలర్‌లో బుధవారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 17 మంది గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడ్డవారిని ఎన్ఎల్సీ లిగ్నైట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి పేలుడు సంభవించిన బాయిలర్ ఆపరేషన్ నిలిపివేసామని అధికారులు తెలిపారు. గత రెండు నెలల కాలంలో నైవెల్లి లిగ్నైట్ ప్లాంట్‌లో పేలుడు చోటుచేసుకోవడం ఇది రెండోసారి. ఇంతకుముందు మే నెలలో ప్లాంట్‌లోని బాయిలర్ పేలడంతో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. -
చోరీకి వెళ్లిన దొంగకు చిర్రెత్తుకొచ్చింది...
సాక్షి, చెన్నై: దొంగతనానికి వచ్చిన చోట చిల్లిగవ్వ దొరక్కపోవడంతో ఓ దొంగ చిర్రెత్తిపోయాడు. ఆ దుకాణ యజమానికి ఓ లేఖ రాసి చీవాట్లు పెట్టి వెళ్లాడు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. కడలూరు జిల్లా మందారకుప్పంలో జయరామన్ అనే వ్యక్తి కిరాణా దుకాణం నడుపుతున్నాడు. నిత్యం రద్దీగా ఉండే ఈ దుకాణంపై ఓ దొంగ కన్నేశాడు. గురువారం అర్ధరాత్రి అతి కష్టం మీద దుకాణం పై కప్పును తొలగించి లోపలికి వెళ్లాడు. ఉదయాన్నే దుకాణం తెరచిన జయరామన్ షాక్‌కు గురయ్యాడు. పైకప్పు దెబ్బతిన్నా దుకాణంలో వస్తువులు ఏమాత్రం చోరీకి గురి కాలేదు. అయితే కొన్ని వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో వాటిని సరి చేస్తుండగా ఓ లేఖని గుర్తించాడు. ప్రాణాలను పణంగా పెట్టి అతి కష్టం మీద దొంగతనానికి వస్తే గల్లాలో చిల్లిగవ్వ కూడా పెట్టవా? అని అందులో యజమానిని దొంగ ప్రశ్నించాడు. దొంగతనం చేయడం అంత సులభం కాదని..ఎంతో కష్టపడాల్సి ఉందని ఇక్కడున్న పప్పుదినుసులను పట్టుకెళ్లి తానేమి చేసుకోవాలని విచారం వ్యక్తం చేశాడు. ఈ లేఖపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
పిల్లలతో గడపండి
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘తల్లిదండ్రులు తమ బిడ్డల చదువులు, భవిష్యత్తు కోసం డబ్బులు కాదు తగినంత సమయాన్ని ఖర్చు చేయండి, లేకుంటే మాధ్యమాల ప్రభావంలో పడి బతుకును బుగ్గి చేసుకోగలరు జాగ్రత్త’. చెడుదారి పట్టుతున్న నేటి తరం పిల్లల గురించి ఆందోళన చెందుతూ ఈ హితవు మాటలు అన్నది ఎవరో కాదు సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తి. వివరాలు ఇలా ఉన్నాయి. కడలూరు జిల్లా తిట్టకుడి పెరుమలై గ్రామం పుదుకాలనీకి చెందిన ప్రకాష్ (22)ను బాలిక కిడ్నాప్, అత్యాచారం కేసులో ఈ ఏడాది జూలై 7వ తేదీన అరెస్ట్ చేశారు. 84 రోజుల పాటు జైల్లోఉన్నందున తనకు బెయిల్ మంజూరు చేయాలని అతను హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. నిందితుడు ప్రకాష్ 17 ఏళ్ల బాలికను ప్రేమించి, కిడ్నాప్ చేయడంతోపాటు శారీరక సంబంధం పెట్టుకున్నాడని బాధితురాలి తరఫు న్యాయవాది వాదించాడు. పిటిషనర్ ప్రకాష్ చాలా అమాయకుడని, ఆ బాలికే అతనిపై ఒత్తిడి తెచ్చి పరారైందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించాడు. ఇరుతరఫు వాదనలు విన్న తరువాత న్యాయమూర్తి వైద్యనాథన్ పిటిషనర్ ప్రకాష్‌కు గురువారం బెయిల్ మంజూరు చే శారు. ఈ సందర్భంగా పెద్దలు, తల్లిదండ్రులను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులు తనకు ఇష్టం లేని పెళ్లి సంబంధం చూడడంతో తానే ప్రకాష్‌తో వెళ్లానని బాధిత యువతి తన వాంగ్మూలంలో తెలిపింది. తనను ఇంటి నుంచి తీసుకెళ్లకుంటే విషం మింగి ఆత్మహత్య చేసుకుంటానని అతడిని బెదిరించింది. తన ఇష్టాఇష్టాలను పరిగణనలోకి తీసుకోకుండా పెద్దలే తన వివాహాన్ని నిర్ణయించారని ఆ యువతి తెలిపింది. అందుకే ప్రకాష్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశాను’ అని న్యాయమూర్తి తెలిపారు. ఇద్దరి నుంచి రూ.10వేల పూజీ కత్తు చెల్లించి బెయిల్ ఆదేశాలు పొందవచ్చని, అలాగే ప్రతిరోజూ ఉదయం 10.30 గంటలకు పోలీసు స్టేషన్లో సంతకం చేయాలని, విచారణకు పిలిచినపుడు కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి తెలిపారు. అంతేగాక ఈ కేసులో సాక్షులను, ఆధారాలను రూపుమాపే ప్రయత్నాలు చేయరాదని, అజ్ఞాతంలోకి వెళ్లరాదని హెచ్చరించారు. ఈ నిబంధనలు మీరితే కోర్టు తగిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కేసులో బెయిల్ మంజూరు చేసేముందు పెద్దలకు కొన్ని విషయాలు చెప్పదలిచానని న్యాయమూర్తి వైద్యనాధన్ అన్నారు. పిల్లల చదువుల కోసం డబ్బులు ఖర్చుచేసే కంటే వారి భవిష్యత్తు కోసం కొంత కాలాన్ని ఖర్చుచేయడం ముఖ్యమని తల్లిదండ్రులు గుర్తించాలని హితవు పలికారు. లైంగిక వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు ఎన్ని చట్టాలున్నా 12 నుంచి17 వయస్సు బాలికలు తమకు నచ్చిన యువకులతో ఇంటి నుంచి పారిపోయి పోలీసులకు పట్టుబడుతున్నారని అన్నారు. దీని వల్ల బాలికలు మాత్రమే కాదు వారితోపాటూ వెళ్లిపోయే బాలురు, యువకులు సైతం బాధితులుగా మిగిలిపోతున్నారని, న్యాయస్థానం ముందు నిందితులుగా నిలబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి నేరాలకు సులభంగా అందుబాటులో ఉన్న వివిధ మాధ్యమాలే కారణమని ఆయన అన్నారు. సినిమాల్లో టీనేజ్ అమ్మాయితో టీనేజ్ అబ్బాయి వెంట పడడం నిజజీవితంలో కూడా చేయాలని ఆశపడుతున్నారని తెలిపారు. సినిమాల్లో మంచి చెడు విశ్లేషించుకోలేని పిల్లలు తప్పుదారిన పడి బలి అవుతున్నారని చెప్పారు. పిల్లలతో పెద్దలు చనువుగా మెలిగి చేరదీసినపుడే వారిలో విచక్షణాజ్ఞానం పెరుగుతుందని అన్నారు. అంతేగాక తల్లిదండ్రుల వద్ద ఏదీ దాచకూడదనే అభిప్రాయం కలుగుతుందని న్యాయమూర్తి చెప్పారు.