
తమిళనాడు: కడలూర్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో ఫ్యాక్టరీలో పనిచేస‍్తున‍్న కార్మికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. స్థానికంగా ఉండే ఓ కెమికల్ కంపెనీలో బాయిలర్ పేలింది. పేలుడు ధాటికి నలుగురు కార్మికులు మృతి చెందారు. 10 మందికి పైగా గాయపడ్డారు.
ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రుల్ని అత్యవసర చికిత్స కోసం పోలీసులు కడలూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాద ఘటనపై పలు కోణాల్లో ఆరా తీస్తున్నారు. ఫ్యాక్టరీ నిర‍్వహణ నిబంధనలకు అనుగుణంగా ఉందా, లేదంటే అక్రమంగా ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నారా? అన్న కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment