Boiler Blast In Bihar Muzaffarpur: 6 Killed In Tragic Incident - Sakshi
Sakshi News home page

Bihar Boiler Blast: నూడుల్స్‌ ఫ్యాక్టరీలో పేలిన బాయిలర్‌: ఆరుగురు మృతి

Published Sun, Dec 26 2021 3:10 PM | Last Updated on Sun, Dec 26 2021 3:46 PM

Boiler Blast In Bihar Muzaffarpur: 6 Killed In Tragic Incident - Sakshi

Bihar Boiler Explosion: బిహార్‌లో ముజఫర్‌పూర్‌లోని నూడుల్స్ ఫ్యాక్టరీలో భారీ శబ్దంతో బాయిలర్ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆరుగురు మృత్యువాత పడ్డారని మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారని బిహార్‌ పోలీసులు తెలిపారు. ఈ మేరకు నూడుల్స్ ఫ్యాక్టరీలో ఉదయం 10 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించిందని జిల్లా మేజిస్ట్రేట్ ప్రవణ్ కుమార్ తెలిపారు.

(చదవండి: సారీ! రిపోర్టులు మారిపోయాయి.. నీకు కరోనా లేదు!)

అయితే ఈ భారీ పేలుడు శబ్దం కిలోమీటరు దూరం వరకు వినిపించిందని స్థానికులు చెబుతున్నారు. స్థానికులు సమాచారంతో. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. పైగా దెబ్బతిన్న బాయిలర్‌ నుండి పొగ ఇప్పటికి వస్తునే ఉందని అధికారులు అన్నారు. అంతేకాదు ఈ పారిశ్రామిక ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక్కొక్కరికి ₹ 4 లక్షల చొప్పున పరిహారం కూడా ప్రకటించారు.

(చదవండి: ఖరీదైన గిఫ్ట్‌ల స్థానంలో కుక్క బిస్కెట్లు, షేవింగ్‌ క్రీమ్‌లు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement