
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి కరోనా వైరస్ వ్యాప్తితో సామాన్యులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు కన్నుమూస్తున్నారు. తాజాగా బుధవారం ఒక్కరోజే రాజకీయ, సాహిత్య, మీడియా రంగాలకు చెందిన ముగ్గురు మృతిచెందారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ రచయిత అనీశ్ దేవ్ (70), మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి ఏక్‌నాథ్ గైక్వాడ్ (81), తెలంగాణకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ శ్రీధర్ ధర్మాసనం తుదిశ్వాస విడిచారు.
మహారాష్ట్రకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఏక్‌నాథ్ గైక్వాడ్ మంత్రిగా పని చేశారు. ఒకసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన మృతితో కాంగ్రెస్ పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయింది. ఇక పశ్చిమబెంగాల్‌కు చెందిన అనీశ్ దేవ్ ప్రముఖ రచయిత. ఆయన 18వ ఏట నుంచే రచనలు చేయడం మొదలుపెట్టారు. బెంగాలీ సాహిత్య రంగంలో గొప్ప సేవలు అందించారు. ఆయనకు బెంగాల్ ప్రభుత్వం 2019లో విద్యాసాగర్ పురస్కారంతో సత్కరించింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ శ్రీధర్ ధర్మాసనం మా హైదరాబాద్ సంస్థ ద్వారా తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. టిమ్స్ ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. ఆయన మృతికి సీఎం కేసీఆర్, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.
చదవండి: నాలుగంటే నాలుగే రోజుల లాక్‌డౌన్: ఎక్కడంటే..
చదవండి: ఏపీలో కరోనా కట్టడికి అన్ని చర్యలు
Comments
Please login to add a commentAdd a comment