కరీంనగర్ జిల్లా వెల్గటూరు మండలంలో అంబారీపేట వద్ద రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురుఎదురుగా వస్తున్న రెండు కారులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. మూడు మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతులు శేరిలింగం పల్లి వాసులను పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.