నెల్లూరులో ఘోర రోడ్డుప్రమాదం: ముగ్గురి మృతి | road accident in nellore district | Sakshi
Sakshi News home page

నెల్లూరులో ఘోర రోడ్డుప్రమాదం: ముగ్గురి మృతి

Published Sat, Feb 27 2016 7:55 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM

road accident in nellore district

నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సంభవించిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శనివారం తెల్లవారు జామున పెళ్లూరు మండలం శిరసనంబేడు వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, ఓ వ్యక్తి లారీ క్యాబిన్ లో చిక్కుకుని సుమారు గంటపాటు నరకయాతన అనుభవించాడు.

స్ధానికులు గంట తర్వాత ఆ వ్యక్తిని క్యాబిన్ నుంచి బయటకు తీసి చికిత్స కోసం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. తరచూ ఈ ప్రాంతంలో ఘటనలు చోటుచేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. స్పీడ్ బ్రేకర్లు పెట్టాలని అడిగినా ప్రయోజనం కనిపించలేదని చెప్పారు. ఈ క్రమంలోనే నేడు మరో ప్రమాదం జరిగి ముగ్గురు వ్యక్తులు చనిపోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement