speed breakers
-
గాల్లో ఎగురుతున్న బండ్లు..
-
రోడ్డు ప్రమాదాలపై నిర్లక్ష్యం
► నివారణలు చేపట్టని అధికారులు సింహాద్రిపురం: మండలంలో పలు ప్రాంతాలు రోడ్ల ప్రమాదాలకు చిరునామాగా మారుతున్నాయి. సంబంధిత అధికారులు మాత్రం ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవడంలేదని వాహనదారులు విమర్శిస్తున్నారు. మండల పరిధిలోని టీటీడీ కళ్యాణ మండపం, నిడివెల్ల, ఆగ్రహారం, నక్కలపల్లె గ్రామాల వద్ద అధికంగా రోడ్లు ప్రమాదాలు జరుగుతున్నాయి. అయినా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలలో ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదు. రెండు వరుసల రోడ్డు కావడం.. వాహన చోధకులు అడ్డు అదుపు లేకుండా స్పీడ్ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. దీంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకూ ప్రమాదాల్లో 8మంది మృత్యువాత పడగా.. 10మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదాలు జరుగుతూనే ఉన్నానివారణకు ఆర్అండ్బీ అధికారులు, పోలీసులు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంపట్ల వాహన చోదకులు విమర్శిస్తున్నారు. వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అపరాద రుసుం విధించి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారే తప్ప కఠిన చర్యలు తీసుకోవడంలేదని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించుకొని మండల ప్రజలు కోరుతున్నారు. సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి.. : తరుచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న చోట సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా ఆగ్రహారం వద్ద ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. ఆర్అండ్బీ అధికారులు స్పందించాలి. ---రవీంద్రనాథరెడ్డి(స్థానికుడు), ఆగ్రహారం ప్రమాదాలు నివారిస్తాం.. : ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రమాదాల సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. గ్రామాల్లో అనేక సార్లు ట్రాఫిక్ విషయాలపై అవగాహన కల్పించాం. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ---హనుమంతు(ఎస్ఐ), సింహాద్రిపురం -
స్పీడ్ బ్రేకర్లను మరిచారా..?
సందర్భంగా మిర్యాలగూడ–నాగార్జునసాగర్ ప్రధాన రహదారిని మరమ్మతులు చేయడంతోపాటు డివైడర్లకు, కల్వర్టులకు రంగులు వేశారు. కానీ ప్రమాదకరంగా మారిన స్పీడ్‌బ్రేకర్లను మాత్రం మరిచి పోయారు. స్పీడు బ్రేకర్లు ఉన్నట్లుగా ఎక్కడా ఒక్క సూచికబోర్డుకు ఏర్పాటు చేయలేదు. దీంతో సాగర్–మిర్యాలగూడ రహదారి ప్రమాదకరంగా మారింది. ఈ రహదారి మీదుగా దూరప్రాంతాల నుంచి వచ్చే వారు సమీపంలోకి వచ్చే వరకు స్పీడు బ్రేకర్ ఉన్నట్లు తెలియక తమ వాహనాలను సడెన్‌గా బ్రేక్‌లు వేసి ఆపే క్రమంలో ముప్పుపొంచి ఉంది. ఇదే క్రమంలో వెనకాల వచ్చే వాహనాలు ఢీకొట్టే ప్రమాదం లేకపోలేదు. ఇలాంటివే గతంలోనే పలు ప్రమాదాలు జరిగినా ఆర్అండ్బీ అధికారులు మాత్రం వాటిని పట్టించుకున్నట్లు కన్పించడం లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారిపై స్పీడు బ్రేకర్లు ఉన్నట్టు సూచిక బోర్డులు ఏర్పాటు చేయడం, స్పీడు బ్రేకర్లకు రంగులు వేయాలని వాహనదారులు కోరుతున్నారు. -
స్పీడ్ బ్రేకర్లు తొలగించండి
హైవేలపై రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం న్యూఢిల్లీ: జాతీయరహదారులపై ఉన్న అన్ని స్పీడ్ బ్రేకర్లను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాలను, ఎన్హెచ్ఏఐ, పీడబ్ల్యూడీ వంటి నిర్వహణ సంస్థలకు కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆదేశాలు జారీచేసింది. భద్రత కోసం స్పీడ్ బ్రేకర్లు ఏర్పాట్లు చేస్తున్నా.. రవాణా సజావుగా సాగేందుకు అవి ఇబ్బందికరంగా మారాయని పేర్కొంది. వాటి తొలగింపునకు ఏం చర్యలు తీసుకుంటున్నారో వచ్చే బుధవారం లోగా చెప్పాలని, డ్రైవర్లకు వేగాన్ని తగ్గించాలని సూచించే ఇనుప వరుసల(రంబల్ స్ట్రిప్స్) వివరాలను అందించాలని ఆదేశించింది. స్పీడ్ బ్రేకర్లు పెట్టకూడదన్న నిబంధనలు ఉన్నా వేగాన్ని అడ్డుకునేందుకు స్థానిక యంత్రాంగం వీటిని నిర్మిస్తున్నాయంది. ‘రవాణా సక్రమంగా సాగేందుకే హైవేలున్నాయి. స్పీడ్‌బ్రేకర్లు వాహనాలకు అడ్డంకిగా మారడంతో పాటు ప్రమాదాలకు కారణ మవుతున్నాయి’ అని పేర్కొంది. 2014 నాటిలెక్కల ప్రకారం స్పీడ్‌బ్రేకర్ల వల్ల జరిగిన ప్రమాదాల్లో 4,726 మంది చనిపోయారు. -
నెల్లూరులో ఘోర రోడ్డుప్రమాదం: ముగ్గురి మృతి
నెల్లూరు: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సంభవించిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. శనివారం తెల్లవారు జామున పెళ్లూరు మండలం శిరసనంబేడు వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి. ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందగా, ఓ వ్యక్తి లారీ క్యాబిన్ లో చిక్కుకుని సుమారు గంటపాటు నరకయాతన అనుభవించాడు. స్ధానికులు గంట తర్వాత ఆ వ్యక్తిని క్యాబిన్ నుంచి బయటకు తీసి చికిత్స కోసం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. తరచూ ఈ ప్రాంతంలో ఘటనలు చోటుచేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. స్పీడ్ బ్రేకర్లు పెట్టాలని అడిగినా ప్రయోజనం కనిపించలేదని చెప్పారు. ఈ క్రమంలోనే నేడు మరో ప్రమాదం జరిగి ముగ్గురు వ్యక్తులు చనిపోగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. -
అడుగడుగునా స్పీడ్బ్రేకర్లే..
అమలాపురం :జాతీయ రహదారి -216 విస్తరణకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ రహదారి విస్తరణతోపాటు జిల్లాలో ఏడు చోట్ల బైపాస్‌ల నిర్మాణం చేపటాల్సి ఉంది. దీని వల్ల పలుచోట్ల ఇళ్లు, వ్యాపార సముదాయాలు, భూములు కోల్పోతున్న వారు విస్తరణకు సంబంధించిన సర్వేపనులను అడ్డుకోవడం, రోడ్డెక్కి ఆందోళన చేయడం చూస్తుంటే పనులు పూర్తవుతాయనే నమ్మకం కలగడం లేదు. జిల్లాలోని కత్తిపూడి నుంచి కృష్ణా జిల్లాలోని పాముర్రు వరకు గత ఎన్డీఏ హయాంలో అప్పటి లోక్‌సభ స్పీకర్ జి.ఎం.సి.బాలయోగి కృషితో ఈ జాతీయరహదారి నిర్మించారు. తిరిగి ఎన్డీఏ హయాంలో ఈ రహదారి విస్తరణకు అనుమతి రాగా, ఇటీవల రూ.మూడు వేల కోట్లు మంజూరైనట్టు సమాచారం. ఇప్పుడున్న ఏడు మీటర్ల రహదారిని మూడు మీటర్ల మేర విస్తరించి, పది మీటర్లు చేయాలని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పామర్రు నుంచి అవనిగడ్డ, రేపల్లె, గుంటూరు జిల్లా బాపట్ల, ప్రకాశం జిల్లా చీరాల మీదుగా ఒంగోలు వద్ద జాతీయ రహదారి- 16లో కలిసే ఈ రహదారి విస్తరణతో కాకినాడ, మచిలీపట్నం పోర్టుల ద్వారా సరుకు రవాణా మరింత వేగవంతమవుతుంది. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల తీర ప్రాంతాల నుంచి మత్స్య, కొబ్బరి, ఇతర ఉత్పత్తులు ఒడిశా, పశ్చిమబెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలకు ఎగుమతి చేసేందుకు దగ్గరదారి అవుతుంది. రహదారి విస్తరణ సర్వే ఏప్రిల్ నెలాఖరుకు పూర్తి చేసి మే నుంచి పనులు చేయాలని ఎన్‌హెచ్ అధికారులు భావిస్తున్నారు. జిల్లాలో మూడు ప్యాకేజీలుగా పనులు.. జిల్లాలోని కత్తిపూడి నుంచి దిండి- చించినాడ వంతెన వరకు విస్తరణ పనులను మూడు ప్యాకేజీలుగా చేశారు. కత్తిపూడి నుంచి కాకినాడ, కాకినాడ నుంచి అనాతవరం, అనాతవరం నుంచి దిగమర్రు వరకు పనులు చేయనున్నారు. ఇప్పుడున్న రహదారిలో ఎక్కువగా ఉన్న మలుపులను తగ్గించేందుకు ఏరియల్ సర్వే చేశారు. పలు పట్టణాలు, మేజర్ పంచాయతీల మీదుగా రహదారి వెళ్లాల్సి రావడంతో స్థల సేకరణకు భారీగా నిధులు వెచ్చించాల్సి రావడంతో పలుచోట్ల బైపాస్ రోడ్లు నిర్మించాలని ఎన్‌హెచ్ నిర్ణయించింది. కత్తిపూడి, చేబ్రోలు, గొల్లప్రోలు, కాకినాడ, ముమ్మిడివరం, అమలాపురం, రాజోలులో బైపాస్ రోడ్లు నిర్మించాల్సి ఉంది. గతంలో పిఠాపురం, తాళ్లరేవు వద్ద బైపాస్‌లు పూర్తయ్యూరుు. పలు చోట్ల ఇళ్ల స్థలాలు, భూములు, వ్యాపార సముదాయాలు, ప్రముఖ ఆలయాలను తొలగించాల్సి ఉంది. ఇదే పలు వివాదాలకు కారణమవుతోంది. ఇవీ వివాదాలు.. అమలాపురం బైపాస్ రోడ్డును భట్నవిల్లి 93.3 కిలోమీటర్ల వద్ద ఆరంభించాలని ఎన్‌హెచ్ అధికారులు నిర్ణయించారు. ఇప్పుడు దీనిని కొంత ముందుకు తీసుకు వెళ్లడం వల్ల తమకు చెందిన ఐదు ఇళ్లు పోతున్నాయని స్థానికులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై జేసీ మార్కండేయులు మంగళవారం పరిశీలించారు. కత్తిపూడి నుంచి నుంచి లెక్కిస్తే 100 కి.మీ. వద్ద టోల్‌ప్లాజా నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పుడున్న రహదారికి అటు 70, ఇటు 70 మీటర్ల చొప్పున భూమి సేకరించాలని నిర్ణయించారు. ఇది అమలాపురం పట్టణ శివారు పేరూరు వై.జంక్షన్ నుంచి మేకల కాలువ వరకు నిర్మించాల్సి వస్తుంది. దీని వల్ల మూడు కాలనీల్లోని 100 ఇళ్లు, పాఠశాల, కళాశాల, రియల్ ఎస్టేట్ ప్లాట్లు పోతారుు. దీనికి బదులు బోడసకుర్రు వంతెన సమీపంలో ప్రభుత్వ స్థలాల వద్ద నిర్మించాలని స్థానికులు కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. దీనితో సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. తమ స్థలాలను స్వాధీనం చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు విస్తరణ వల్ల రాజోలు దీవిలో వాణిజ్య కేంద్రమైన తాటిపాక స్వరూపం మారిపోతుంది. వ్యాపార సముదాయలు, ఇళ్లు పెద్ద ఎత్తున తొలగించాల్సి వస్తుంది. దీని వల్ల వ్యాపారులు తీవ్రంగా నష్టపోవడంతోపాటు తాటిపాక, మామిడికుదురు, నగరం వంటి చోట పెద్ద ఎత్తున ఇళ్లను తొలగించాల్సి వస్తుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని స్థానికులు బైపాస్ రోడ్డు నిర్మించాలని గతంలో నిరాహారదీక్షలు చేపట్టారు. దీనికి స్పందించిన అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు స్థానికులను కేంద్ర ఉపరితల రవాణా శాఖమంత్రి నితిన్ గ డ్కరీ వద్దకు తీసుకు వెళ్లి బైపాస్‌పై హామీ ఇప్పించారు. అయితే ఇప్పటికీ ఇక్కడ బైపాస్కు ఎన్‌హెచ్ నుంచి అనుమతి రాకపోవడం విశేషం. బైపాస్ ప్రతిపాదన దశలోనే ఉందని ఎన్‌హెచ్ వర్గాలు చెప్పడంతో స్థానికుల్లో ఆందోళన తొలగలేదు. ముమ్మిడివరం బైపాస్ రోడ్డు ఎలైన్మెంట్ మార్చడం వల్ల తమ ఇళ్లు, ఇళ్ల స్థలాలను కోల్పోతామని, పెద్దల స్థలాలను రక్షించడం కోసం పేదలైన తమను నష్టపరచడం భావ్యం కాదని స్థానికులు నిరాహారదీక్షలకు దిగారు. ఈ నేపథ్యంలో ఈ జాతీయ రహదారి విస్తరణ ఎలా, ఎన్నటికి సాధ్యమవుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.