
మైసూరు : లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారును ఢీకొనడంతో ఇద్దరు చిన్నారుల సహా కారు డ్రైవర్ మృతి చెందిన సంఘటన శనివారం చామరాజనగర పట్టణం సమీపంలో ఉన్న సోమవార పేట వద్ద చోటుచేసుకుంది. వివరాలు... విజయపుర జిల్లాలోని ఇండి తాలూకాలో ఉన్న కోలూరగి గ్రామానికి చెందిన ఓ కుటుంబ తమిళనాడు ప్రాంతానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా చామరాజ పేట వద్ద కొబ్బరి బోండా తాగడానికి నిలిపారు. దంపతులు కారు నుంచి బయటకు వచ్చారు. కారులో సంకేత్ కుమార్ (4), లక్ష్మీకాంత్ (14)లతో పాటు కారు డ్రైవర్ ఉన్నారు. అదే రోడ్డులో వాయువేగంతో వచ్చిన ఓ లారీ అదుపుతప్పి కారును వేగంగా ఢీకొంది. దీంతో కారులో ఉన్న చిన్నారులతో పాటు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. చామరాజనగర ట్రాఫిక్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment