ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగింది.
చౌటుప్పల్ (నల్గొండ జిల్లా): ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు చెరువులో మునిగి మృతి చెందిన సంఘటన నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం పెద్దకొండూరు గ్రామంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జరిగింది. వివరాలు.. పెద్దకొండూరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు సమీపంలోని చెరువుకు వెళ్లారు. ఈత కొడుతూ లోతుగా ఉన్న ప్రదేశానికి వెళ్లడంతో ముగ్గురూ మునిగిపోయారు. విషయం తెలిసిన స్థానికులు చెరువులో గాలింపు జరిపి ఇద్దరు పిల్లల మృతదేహాలను వెలికితీశారు. మరో మృతదేహం కోసం గాలిస్తున్నారు. వారి పేర్లు, తదితర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.