నెత్తురోడిన రహదారులు | three Died In Road Accident | Sakshi
Sakshi News home page

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి..

Published Tue, Aug 28 2018 3:03 PM | Last Updated on Thu, Aug 30 2018 4:17 PM

three Died In Road Accident   - Sakshi

బయ్య శివకుమార్‌ మృతదేహం

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. పోతు నూ రు స్టేజీ వద్ద కారు ఢీకొని బాలుడు.. వల్లభాపురం వద్ద బైక్‌ అదుపు తప్పి ఒకరు.. ఏపీలింగోటం సమీపంలో ఆగిఉన్న లారీని ప్రైవేట్‌ బస్సు ఢీకొనడంతో మరొకరు మృతిచెందారు.

కారు ఢీకొని బాలుడి దుర్మరణం

పెద్దవూర(నాగార్జునసాగర్‌) : కారు ఢీకొని ఓ బాలుడు దుర్మరణం చెందాడు.  ఈ సంఘటన సోమవారం పెద్దవూర మండలం పోతునూరు గ్రామ స్టేజీ వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పో తునూరు గ్రామానికి చెందిన రొయ్య మల్లయ్య కూతురు నాగమ్మను చందంపేట మండలం గుంటిపల్లికి చెందిన బయ్య మల్లయ్యకు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం చేశారు. రాఖీ పండుగకు తన సోదరులకు రాఖీలు కట్టడానికి గాను బయ్య నాగమ్మ తన భర్త, ఇద్దరు పిల్లలతో కలి సి ఆదివారం తన పుట్టిల్లు పోతునూరు గ్రామానికి వచ్చింది. వీరితో పాటు తన అక్కాచెల్లెళ్లు సైతం రాఖీలు కట్టడానికి రావడంతో ఆదివా రం అంతా ఉత్సాహంగా గడిపారు.

సోమవా రం తన సోదరుడు డబ్బులు ఇవ్వడంతో పిల్లలను తల్లిగారింటి వద్ద ఉంచి ముగ్గురు అక్కాచెల్లెళ్లతో పాటు తన భర్త మల్లయ్యను వెంట తీసుకుని పెద్దవూరకు షాపింగ్‌ చేయడానికి వచ్చా రు. పిల్లందరూ రోడ్డు దాటి సమీపంలో ఉన్న ఏఎమ్మార్పీ మైనర్‌ కాలువకు స్నానాలు చేయటానికి వెళ్లారు. ఈ క్రమంలో మిగిలిన పిల్లలు కాలువలో స్నానాలు చేస్తుండగా బయ్య శివకుమార్‌(8) ఇంటికి రావడానికి రోడ్డును దాటుతుండగా హైదరాబాద్‌ వైపు నుంచి అతివేగంగా వస్తున్న కారు ఢీ కొట్టింది.

దీంతో శివ అంతెత్తున ఎగిరి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు బలంగా తాకడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. కారు డ్రైవర్‌ బాలుడిని తన కారులో చికిత్స నిమిత్తం హాలియాకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. విషయాన్ని బాలుడి తల్లిదండ్రులకు ఫోన్‌లో సమాచారం అందించడంతో వారు బోరున విలపించారు. మృతుడు గ్రామంలోనే మూడో తరగతి చదువుతున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నాగార్జునసాగర్‌ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు. మృతుడు తండ్రి మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దూది రాజు తెలిపారు.

బైక్‌ డివైడర్‌ను ఢీకొని ఒకరు..

చివ్వెంల (సూర్యాపేట) : అదుపు తప్పి బైక్‌ డివైడర్‌ను ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెం దాడు. ఈ సంఘటన చివ్వెంల మండలం వల్ల భాపురం గ్రామ స్టేజీ వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  గుంపుల గ్రామానికి చెందిన పేరెల్లి నాగ య్య (34) బైక్‌పై సూర్యాపేటకు వెళ్లి తిరిగి వస్తుండగా వల్లభాపురం గ్రామం వద్ద హైదరాబాద్‌ – విజయవాడ రహదారిపై బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో నాగయ్య తలకు తీవ్ర గాయాలు కాగా చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ బి.ప్రవీణ్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.   కారు, ప్రైవేట్‌ బస్సు బోల్తా.. ఆరుగురికి గాయాలుచివ్వెంల (సూర్యాపేట) :  మండల పరిధిలో సో మవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదా ల్లో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు.

అతివేగంగా వస్తున్న కారు అదుపు తప్పి బోల్తాపడడంతో భార్యాభర్తకు గాయాలయ్యాయి. ఈ సంఘటన గుంజలూరు గ్రామ స్టేజీ వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా రం.. విజయవాడకు చెందిన భార్గవ్‌ తన భార్య లక్ష్మితో కలిసి కారులో హైదరాబాద్‌కు వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో గుంజ లూరు గ్రామ స్టే జీ వద్దకు రాగానే హైదరాబాద్‌–విజయవాడ రహదారిపై వారి కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం  స్థానికులు సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు.

తిర్మలగిరి శివారులో ప్రైవేట్‌ బస్సు..

జి.తిర్మలగిరి గ్రామ శివారులో జాతీయ రహదా రిపై ఓ ప్రైవేట్‌ బస్సు బోల్తాపడింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తున్న ఓ ట్రావెల్స్‌ ప్రైవేట్‌ బస్సు వేగంగా వస్తూ అదుపుతప్పి బోల్తా పడిం ది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ రాజుతో పాటు మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ఎటువంటి హాని జరుగకపోవడంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

 ప్రైవేట్‌ బస్సు ఢీకొని లారీ డ్రైవర్‌ దుర్మరణం

నార్కట్‌పల్లి(నకిరేకల్‌) : నార్కట్‌పల్లి మం డలం ఏపీలింగోటం గ్రామ సమీపంలో సోమవారం రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని ప్రైవేట్‌ బస్సు వెనక నుంచి ఢీకొనడంతో లారీ డ్రైవర్‌ మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. పోలీసులు  తెలి పిన వివరాల ప్రకారం.. మర్రిగూడెం మం డలం రాంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కా రింగ్‌ కృష్ణయ్య (45) లారీడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.  విజయవాడ నుంచి హైదరాబా ద్‌కు బొగ్గు లోడుతో ఒక్కడే వెళ్తూ మార్గమధ్యలో ఏపీలింగోటం గ్రామ శివారులో టైర్‌ పంక్చర్‌ కావడంతో రోడ్డు పక్కన ఆపి రిపేర్‌ చేయిస్తున్నాడు.

ఆదేదారిలో వెళ్తున్న ప్రైవేటు బస్సు వెనుక నుంచి అతివేగంగా ఢీకొనడంతో లారీడ్రైవర్‌ అక్కడికక్కడే మృ తి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న ఐదుగురికి గాయాలయ్యాయి. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. కృష్ణయ్య మరణంతో కుటుం బం వీధిన పడనుందని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. ఎస్‌ఐ గోవర్ధన్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసు కుని దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు.

ఆటోను ఢీకొట్టిన కారు.. నలుగురికి గాయాలు

కేతేపల్లి(నకిరేకల్‌) : 65 నంబరు జాతీయ రహదారిపై కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్‌ వద్ద సోమవారం సా యంత్రం ఆటోను కారు ఢీకొట్టిన సంఘటనలో ముగ్గురు విద్యార్థులు, ఆటో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొర్లపహాడ్‌ గ్రామానికి చెందిన పలువురు విద్యార్థులు కేతేపల్లి  ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. సోమవారం పాఠశాల ముగిసిన అనంతరం కొర్లపహాడ్‌ గ్రామం వెళ్లేందుకు ఆరుగురు విద్యార్థులు కేతేపల్లిలో ఆటో ఎక్కారు.

ఈక్రమంలో ఆటో కొర్లపహాడ్‌ బస్‌స్టేజీ సమీపంలోకి చేరుకోగానే విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న కా రు ఆటోను వెనుక వైపు నుంచి ఢీకొట్టింది. ఈప్రమాదంలో ఆటో డ్రైవర్‌ కొప్పుల ఉమేష్‌తో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థులు ఎడ్ల కర్ణాకర్, సూరారపు ప్రగతి, వం టెపాక నవ్యలు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం నకిరేకల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలం వద్దకు చేరుకున్న కేతేపల్లి ఎస్‌ఐ రజనీకర్‌ ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అదుపులోకి తీ సుకుని బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు నిర్వహిం చారు. అనంతరం కేసు నమోదు చేసుకుని కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement