ప్రమాదం అనంతరం రవళిని మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తున్న కుటుంబ సభ్యులు , ఇన్‌సెట్‌లో రవళి, అక్షర ఫైల్స్
భువనగిరిఅర్బన్ : ఆస్పత్రికి వెళ్లి వస్తున్న వారిని మృత్యువు వెంటాడింది. వైద్య పరీక్షలు అనంతరం ఇంటికి వస్తుండగా ట్రాక్టర్ ఢీకొట్టడంతో మహిళ, ఓ చిన్నారి దుర్మరణం చెందారు. ఈ సంఘటన శుక్రవారం భువనగిరిలోని పోస్టాఫీస్ కార్యాలయం వద్ద జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఆర్‌బీనగర్‌కు చెందిన దేవరకొండ ప్రసాద్, రవళి(35) దంపతులు. ప్రసాద్ చెల్లెలు స్వాతి కుమా ర్తె అక్షర(4) అనారోగ్యంగా ఉండడంతో రవళి భువనగిరి ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్య పరీక్షల అనంతరం తిరిగి ఇంటికి వెళ్లేందుకు బయలుదేరారు.
క్రమంలో పోస్టాఫీసు కార్యాలయం ఎదుట రోడ్డును దాటుతున్నారు. ఈ క్రమంలో పాతబస్టాండ్ వైపు నుంచి బస్టాండ్ వైపు వెళ్తున్న ట్రాక్టర్ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవళి, అక్షర ఇద్దరు ట్రాక్టర్ కిందపడ్డారు. గమనించని డ్రైవర్ ట్రాక్టర్‌ను ముందుకు తీసుకెళ్లడంతో వా రిపై నుంచి ట్రాక్టర్ వెళ్లిపోయింది. దీంతో అక్షర అక్కడికక్కడే మృతిచెందింది. తీవ్రగాయాలైన ర వళిని స్థానికులు ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ఆమె మృతిచెందినట్టు అక్కడ వైద్యులు చెప్పారు. అక్షర తండ్రి వెంకటేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ
రవళి, అక్షర కుటుంబ సభ్యులను మున్సిపల్ చైర్‌పర్సన్ నువ్వుల ప్రసన్న పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మృతుల కు టుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. ప్రభుత్వం తరఫున సహాయం అందేలా చూస్తామని చెప్పారు. పరామర్శించిన వారిలో వార్డు కౌన్సిలర్ ఎలిగె నరేశ్, సత్యనారాయణ, సు ధాకర్, నర్సింహ, అంకర్ల సత్తమ్మలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment