ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొని ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది.
పినపాక(ఖమ్మం): ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొని ముగ్గురు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. పినపాక మండలం దుగునేపల్లి పంచాయతి పరిధిలోని చేగర్సల గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం కోట్లపల్లి పంచాయతి గడ్డంపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బైక్‌పై (మణుగూరు-ఏటూరునాగారం జాతీయరహదారిపై) వెళ్తూ.. ఎదురుగా వస్తున్న ఇసుక లారీకి ప్రమాదవశాత్తు ఢీకొన్నారు.
దీంతో బైక్‌పై ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.