ఆంథోల్: మెదక్ జిల్లాలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆంథోల్ మండలం చింతకుంట వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి.
ఈ ఘటనలో పాపన్నపేట మండలం మల్లంపేట గ్రామానికి చెందిన ఇస్మాయిల్‌బీ(32), జమాలుద్దీన్(42), తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలానికి చెందిన లక్ష్మినరసింహ స్వామి(25) అక్కడిక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.