ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ: ముగ్గురి మృతి
Published Fri, Oct 21 2016 3:17 PM | Last Updated on Thu, Aug 30 2018 4:10 PM
ఒంగోలు: ఒంగోలు జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేయబోయిన ఆటో, ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక మహిళ అక్కడికక్కడే మృతిచెందగా, ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతిచెందారు. ఆ సమయంలో ఆటోలో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. బస్సులోని ప్రయాణికులు క్షేమంగా ఉన్నారు.
Advertisement
Advertisement