వేగంగా వెళ్తున్న కారును ఎదురు మార్గంలో వస్తున్న లారీ ఢీ కొట్టింది.
చిత్తూరు: వేగంగా వెళ్తున్న కారును ఎదురు మార్గంలో వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పూతలపట్టు సమీపంలోని స్కైబర్డ్ హోటల్ వద్ద ఆదివారం ఉదయం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పురుషులు, ఒక మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన పదేళ్ల బాలుడిని మెరుగైన వైద్యం కోసం చిత్తూరులోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కారు నంబరు ఆధారంగా మృతి చెందిన వారు కేరళ వాసులుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.