
పిడుగుపాటుకు ముగ్గురు మృతి
వనపర్తి జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు
వనపర్తి: వనపర్తి జిల్లాలో పిడుగుపాటుకు ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. జిల్లాలోని ఆత్మకూరు మండలం బాలకిష్టాపూర్ గ్రామం సమీపంలో అడవిలో ఈ ఘటనలో చోటు చేసుకుంది.
మృతులను ఈదన్న(45), పరమేష్(25), లక్ష్మన్న(40)లుగా గుర్తించారు. వీరంతా బాలకిష్టాపూర్‌కు చెందినవారు. పొయ్యిలోకి కట్టెలు కొట్టుకోవడానికి వీరంతా అడవికి వచ్చిన సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన మరో ఇద్దరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.