రెండు ఆర్టీసీ బస్సులు ఢీ: మహిళ మృతి, పలువురికి గాయాలు
ఖమ్మం, న్యూస్‌లైన్: ఖమ్మం జిల్లాలో గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. తల్లాడ మండలం నరసింహారావుపేట వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కొత్తగూడెం నుంచి సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుళ్లతో వస్తున్న బస్సు తల్లాడ మండలం నరసింహారావుపేట వద్ద టైరు పేలడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కొత్తగూడెం, ఖమ్మం ఆస్పత్రులకు తరలించారు. ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. ఆమె వివరాలు తెలియాల్సి ఉంది. ఎన్నికల లెక్కింపు బందోబస్తుకు ఖమ్మం బయలుదేరిన సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుళ్లు, మణుగూరు ఎక్స్‌ప్రెస్ బస్సులోని పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.
ద్విచక్ర వాహనాన్ని, ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ : ముగ్గురు మృతి
కొణిజర్ల మండలం పల్లిపాడులో రోడ్డు పక్కన నిలిచి ఉన్న ద్విచక్ర వాహనం, ట్రాక్టర్‌లను ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కొణిజర్ల మండలంలోని లాలాపురానికి చెందిన అన్నదమ్ములు పుచ్చకాయల లాల్‌బాబు(38), నరసింహారావు (34) వరిగడ్డి కొనేందుకు వైరా మండలంలోని ఓ గ్రామానికి బయలు దేరారు. ఈ క్రమంలో పల్లిపాడులో ట్రాక్టర్ మాట్లాడుకుని గడ్డి లోడు చేసేందుకు ఆరుగురు కూలీలను ట్రాక్టర్‌లో ఎక్కించుకుని ట్రాక్టర్ ఓనర్ నంజాల నరసింహారావు ఇంటి దగ్గర నుంచి వైరా వైపు వెళ్తున్నారు. ట్రాక్టర్‌తో పాటు నరసింహారావు, లాల్‌బాబు సోదరులు ద్విచక్రవాహనంపై ట్రాక్టర్ వెనకాల ఆగి ఉన్నారు.
ఈ క్రమంలో ఖమ్మం వైపు నుంచి వైరా వైపు వెళుతున్న లారీ వేగంగా వచ్చి ట్రాక్టర్ వెనక ఉన్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి అదే వేగంతో ముందు ఉన్న ట్రాక్టర్ ను కూడా ఢీకొంది. దీంతో ద్విచక్రవాహనం లారీ టైర్ల కింద ఇరుక్కపోయి నరసింహారావు, లాల్‌బాబు తీవ్రంగా గాయపడ్డారు. ట్రాక్టర్ ఇంజన్‌పై డ్రైవర్ పక్కన కూర్చున్న మండలంలోని పల్లిపాడుకు చెందిన కొరివి కృష్ణ (చింతయ్య)(24))ఎగిరి పడటంతో ట్రాక్టర్ ఇంజన్ అతనిపై బోల్తా పడి సంఘటన స్థలంలో మృతి చెందాడు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
Published Fri, May 16 2014 3:34 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement
Advertisement