RTC Express
-
యాదాద్రి జిల్లాలో విషాదం.. ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు బోల్తా
సాక్షి, యాదాద్రి భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో ఇద్దరు మృత్యువాతపడగా.. మరికొంత మందికి తీవ్ర గాయాలయ్యాయి. అడ్డగూడూరు మండలం బొడ్డుగూడెం వద్ద ఈ ప్రమాదం జరిగింది. వివరాలు.. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు తొర్రూరు నుంచి హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టకు ఉదయం 10 గంటలకు బయలుదేరింది. కాగా జిల్లాలోని అడ్డగూడూర్ మండలం బొడ్డుగూడెం వద్దకు రాగానే అతి వేగం కారణంగా బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడి పల్టీ కొట్టింది. దీంతో అక్కడిక్కడే ఇద్దరు మరణించారు. మృతులను అడ్డ గూడూరు మండలం చిన్నపడిశాలకు చెందిన చుక్క యాకమ్మ అనే మహిళ, బీబీనగర్‌కు చెందిన కొండా రాములుగా గుర్తించారు. కొండ రాములు అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామ కార్యదర్శిగా పనిచేస్తున్నట్లు తేలింది. మరో 10 మందికి పైగా గాయపడ్డారు. మాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: రితీ సాహా మృతిపై వైద్యుల కమిటీ విచారణ -
ఘోర రోడ్డు ప్రమాదం
ఇంద్రవెల్లి/ఆదిలాబాద్ రిమ్స్ : ఇంద్రవెల్లి మండలం ఇన్కార్‌గూడ-శంకర్‌గూడ గ్రామాల మధ్య ప్రధాన రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సుమారు 20 మంది వరకు గాయపడ్డారు. వీరిలో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులు ఆదిలాబాద్ రిమ్స్‌లో చికిత్స పొందుతుండగా.. హాహాకారాలతో ఆస్పత్రి ఆవరణ దద్దరిల్లింది. ఎస్సై హనోక్, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్ బస్సు ఆదిలాబాద్ నుంచి మంచి ర్యాల వైపు వెళ్తోంది. లక్సెట్టిపేట నుంచి ఐచర్ వాహనం బియ్యం లోడ్‌తో ఆదిలాబాద్ వైపు వెళ్తోంది. మండలంలోని ఇన్కార్‌గూడ-శంకర్‌గూడ మధ్య ప్రధాన రహదారిపై ఆర్టీసీ బస్సు, ఐచర్ వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బస్సు డ్రైవర్ రాంచందర్‌తోపాటు ప్రయాణికులు ఆదిలాబాద్‌కు చెందిన ఉపాధ్యాయురాళ్లు కె.సునీత(కేస్లాపూర్ పాఠశాల), నస్రీమ్‌బేగం(నార్నూర్ ఉర్దూ మీడియం పాఠశాల), రజితారెడ్డి(ఇంద్రవెల్లి ఏహెచ్ఎస్), సరస్వతీ(పిట్టబొం గరం ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు), ఆదిలాబాద్‌కు చెందిన శైలజ తీవ్రం గా గాయపడ్డారు. వీరితోపాటు మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. శంకర్‌గూడ, ఇన్కార్‌గూడ గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108, ప్రైవేటు వాహనాల్లో ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. సంఘట న స్థలంలో క్షతగాత్రులను ఆది లాబాద్ నుంచి ఉట్నూర్ వైపు వెళ్తున్న ఎంపీ గెడం నగేష్ పరామర్శించారు. బస్సు డ్రైవర్ అతి వేగంగా నడపడం వల్లే ప్రమా దం జరిగిందని ఎస్సై హనోక్ తెలిపారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. రిమ్స్‌లో చికిత్స రోడ్డు ప్రమాద క్షతగాత్రులు సుమారు 20 మందిని ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులు, వారి బంధువులతో ఆస్పత్రి నిండిపోయింది. తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయురాళ్లు కె.సునీత, నస్రీన్బేగంతోపాటు డ్రైవర్ రాంచందర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. చికిత్స పొందుతున్న వారిని డీఎంహెచ్‌వో రుక్మిణమ్మ, ఆర్డీవో సుధాకర్‌రెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, రిమ్స్ సూపరింటెండెంట్ అశోక్ పరామర్శించారు. ప్రమాద బాధితులకు ఇబ్బందులు కలుగకుండా పోలీసు ఎవరినీ లోపలికి అనుమతించలేదు. ఎమర్జెన్సీ వార్డు ఎదుట టూటౌన్ సీఐ బుచ్చిరెడ్డి, ఎస్సై రాములు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ: మహిళ మృతి, పలువురికి గాయాలు ఖమ్మం, న్యూస్‌లైన్: ఖమ్మం జిల్లాలో గురువారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. తల్లాడ మండలం నరసింహారావుపేట వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కొత్తగూడెం నుంచి సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లతో వస్తున్న బస్సు తల్లాడ మండలం నరసింహారావుపేట వద్ద టైరు పేలడంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కొత్తగూడెం, ఖమ్మం ఆస్పత్రులకు తరలించారు. ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. ఆమె వివరాలు తెలియాల్సి ఉంది. ఎన్నికల లెక్కింపు బందోబస్తుకు ఖమ్మం బయలుదేరిన సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు, మణుగూరు ఎక్స్‌ప్రెస్ బస్సులోని పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. ద్విచక్ర వాహనాన్ని, ట్రాక్టర్‌ను ఢీకొన్న లారీ : ముగ్గురు మృతి కొణిజర్ల మండలం పల్లిపాడులో రోడ్డు పక్కన నిలిచి ఉన్న ద్విచక్ర వాహనం, ట్రాక్టర్లను ఓ లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కొణిజర్ల మండలంలోని లాలాపురానికి చెందిన అన్నదమ్ములు పుచ్చకాయల లాల్‌బాబు(38), నరసింహారావు (34) వరిగడ్డి కొనేందుకు వైరా మండలంలోని ఓ గ్రామానికి బయలు దేరారు. ఈ క్రమంలో పల్లిపాడులో ట్రాక్టర్ మాట్లాడుకుని గడ్డి లోడు చేసేందుకు ఆరుగురు కూలీలను ట్రాక్టర్లో ఎక్కించుకుని ట్రాక్టర్ ఓనర్ నంజాల నరసింహారావు ఇంటి దగ్గర నుంచి వైరా వైపు వెళ్తున్నారు. ట్రాక్టర్‌తో పాటు నరసింహారావు, లాల్‌బాబు సోదరులు ద్విచక్రవాహనంపై ట్రాక్టర్ వెనకాల ఆగి ఉన్నారు. ఈ క్రమంలో ఖమ్మం వైపు నుంచి వైరా వైపు వెళుతున్న లారీ వేగంగా వచ్చి ట్రాక్టర్ వెనక ఉన్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి అదే వేగంతో ముందు ఉన్న ట్రాక్టర్ ను కూడా ఢీకొంది. దీంతో ద్విచక్రవాహనం లారీ టైర్ల కింద ఇరుక్కపోయి నరసింహారావు, లాల్‌బాబు తీవ్రంగా గాయపడ్డారు. ట్రాక్టర్ ఇంజన్‌పై డ్రైవర్ పక్కన కూర్చున్న మండలంలోని పల్లిపాడుకు చెందిన కొరివి కృష్ణ (చింతయ్య)(24))ఎగిరి పడటంతో ట్రాక్టర్ ఇంజన్ అతనిపై బోల్తా పడి సంఘటన స్థలంలో మృతి చెందాడు.