కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్లు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
కర్నూలు: కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్లు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో వెళ్తున్న ఐచర్ వాహనం డీవైడర్ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.