మాగనూరు: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మాగనూరు వద్ద శనివారం రాత్రి చోటుచేసుకుంది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొనడంతో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. మృతులను మహబూబ్ నగర్ జిల్లా భూత్పురు మండలం కప్పెట వాసులుగా గుర్తించారు. ముగ్గురు ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రోడ్డు ఇరుకుగా ఉండటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.