కొవ్వూరు రూరల్: కొవ్వూరులో సోమవారం అర్ధరాత్రి జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. వీరిలో ఇద్దరు విద్యార్థులు కాగా ఒకరు ప్రైవేట్ ఉద్యోగి. ప్రమాదాల వివరాలు ఇలా ఉన్నారుు.. విశాఖపట్నంలోని కంచరపాలెం శివలింగపురానికి చెందిన వైరాల అప్పారావు ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్నారు. పుష్కర విధుల్లో భాగంగా ఆయన కొవ్వూరు వచ్చారు. ఈ నేపథ్యంలో తండ్రిని చూసి వెళదామని అతని కుమారుడు వైరాల తరుణ్‌కుమార్ (20) సోమవారం రాజమండ్రిలో మేనత్త ఇంటికి వచ్చాడు. మేనత్త కుమారుడు దిగమర్తి ప్రేమకుమార్ (17)తో కలిసి అర్ధరాత్రి వేళ మోటార్ సైకిల్‌పై రాజమండ్రి రోడ్డు కం రైలు బ్రిడ్జిపై నుంచి కొవ్వూరు వస్తుండగా వెనుక నుంచి అతివేగంగా వస్తున్న కారు వీరిని ఢీకొట్టింది.
దీంతో తరుణ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా ప్రేమ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని రాజమండ్రిలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున మృతిచెందాడు. తరుణ్‌కుమార్ విశాఖలోని గాయత్రి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతుండగా, ప్రేమ్‌కుమార్ శ్రీకాకుళం జిల్లా నరవలోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడు. బంధువులు కొవ్వూరు చేరుకుని పోస్ట్‌మార్టం అనంతరం తరుణ్ మృతదేహాన్ని కంచరపాలెం తరలించారు. ఒకే కుటుంబానికి ఇద్దరు యువకులు పుష్కర వేళ కన్నుమూయడం వారి కుటుంబాలలో తీరని శోకాన్ని మిగిల్చింది.
గుర్తుతెలియని వాహనం ఢీకొని..
కొవ్వూరుకు చెందిన కంతే సత్యనారాయణ(42) సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఆరికిరేవుల రోడ్డులో వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన స్థానిక ఆంధ్రా సుగర్స్ పరిశ్రమలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య వరలక్ష్మితో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు.
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
Published Wed, Jul 22 2015 1:59 AM | Last Updated on Sun, Sep 3 2017 5:54 AM
Advertisement