separate accidents
-
నెత్తురొడిన రహదారులు
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృత్యువాత పికప్ చేసుకునేందుకు వెళ్లి... గుత్తి రూరల్ : కొత్తపేట గ్రామ శివార్లలో కాశిరెడ్డి నాయన ఆలయం వద్ద 67వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి తూఫాన్ జీపు పల్సర్ బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. పెద్దవడుగూరు మండలం క్రిష్టపాడుకు చెందిన బాబా పకృద్ధీన్ అతని మేనమామ అనంతపురానికి చెందిన ఖాదర్‌బాషా కర్నూలు నుంచి గుత్తికి వచ్చాడు. బస్టాండ్ నుంచి అతడిని గ్రామానికి తీసుకువచ్చేందుకు తన స్నేహితుడైన షేక్ బాషాను తీసుకొని పల్సర్ బైక్‌లో గుత్తికి బయలుదేరాడు. కొత్తపేట గ్రామ శివార్లలోకి రాగానే వారు ప్రయాణిస్తున్న బైక్‌ను తాడిపత్రి వైపునకు వెళ్తున్న తూపాన్ జీపు ఎదురుగా వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ పైకి ఎగిసి పడి అక్కడికక్కడే మృతి చెందారు. బైక్‌ను తూపాన్ జీపు ఢీ కొట్టడంతో మంటలు చెలరేగి దగ్ధమైంది. కాస్త ముందుకెళ్లిన తర్వాత తూఫాన్ వాహనం టైరు పంక్చర్ కావడంతో అందులో ఉన్న వారు కిందకు దిగి పరారయ్యారు. సంఘటనా స్థలాన్ని గుత్తి ఎస్ఐ రామాంజనేయులు సందర్శించి మృతదేహాలను ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకున్నారు. మృతుడు షేక్ బాషాకు భార్య నసీమా, కుమార్తె ఉండగా బాబా పకృద్ధీన్ అవివాహితుడు. కోడలిని పిలుచుకొచ్చేందుకు వెళ్లి మామ.. మడకశిర రూరల్ : ఆటోను ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెలితే.. కర్ణాటక రాష్ట్రం మధుగిరి తాలూకా కదిరేపల్లికి చెందిన శివన్న (52), భార్య జయమ్మ, కుమారుడు ప్రకాష్‌లు ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా గుడిబండ మండలం కల్లురొప్పం గ్రామం నుంచి కోడలు రూప, ఆమె కుమారుడు ప్రీతమ్‌ను స్వగ్రామానికి పిలుచుకుపోవడానికి వచ్చారు. గురువారం వీరితోపాటు రాళ్లపల్లికి చెందిన లక్ష్మమ్మ, మైనగానపల్లికి చెందిన పార్వతమ్మ మడకశిరకు ఆటోలో బయల్దేరారు. గుర్రపుకొండ క్రాస్ వద్ద ప్రధాన రోడ్డుపై ట్రాక్టర్ ఢీకొనడంతో ఆటోలోని వారందరితోపాటు డ్రైవర్ రంగనాథ్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిని మడకశిర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ సతీష్‌కుమార్ చికిత్స చేశారు. శివన్న చికిత్స పొందుతూ ఆస్పత్రిలో మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని మరొకరు సోమందేపల్లి(గోరంట్ల) : గోరంట్ల మండలం పాలసముద్రం జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం గుర్తు తెలియని కారు ఢీకొని చిలమత్తురు మండలం బందేపల్లికు చెందిన సుబ్బిరెడ్డి(56) మృతి చెందాడు. భార్య ఈశ్వరమ్మతో కలిసి ద్విచక్రవాహనంలో వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఈశ్వరమ్మ స్వల్ప గాయాలతో బయటపడింది. సుబ్బిరెడ్డి మృతదేమాన్ని పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
వేర్వేరు ప్రమాదాల్లో 14 మందికి తీవ్ర గాయాలు
ఆగిఉన్న ఆటోను ఢీకొన్న వ్యాను హిరమండలం:అవలంగి గ్రామం సమీపంలో ఆగిఉన్న ఆటోను వ్యాను ఢీకొట్టింది. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం హిరమండలం నుంచి పాతపట్నం వైపు ప్రయాణికులతో వెళుతున్న ఆటో అవలంగి గ్రామం సమీపంలో ఎదురుగా వస్తున్న వ్యాన్‌కు సైడ్ ఇవ్వడానికి డ్రైవర్ ఆపాడు. ఆగిఉన్న ఆటోను వ్యాన్ ఢీకొనడంతో ఆటో బోల్తాపడింది. ఆటోలో ఉన్న డ్రైవర్ చొడి చిన్నారావు, కోటబొమ్మాళి మండలానికి చెందిన శిల్లా కరుణాకరరావు, మొయిలి నారాయణరావు, సుభలయ ఆర్ఆర్ కాలనీకి చెందిన బి.కొండమ్మ, ఈగ ధనలక్ష్మి, నీలమ్మ, కొండరాగోలుకు చెందిన సాదు శివ, హిరమండలంనకు చెందిన బోయిన కృష్ణారావు, పద్మావతికి తీవ్రగాయాలయ్యారుు. వీరిని హిరమండలం పీహెచ్‌సీకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం పాతపట్నం, శ్రీకాకుళం తరలించారు. ఆటో డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ కె.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో 15 మందికి గాయాలు
వేర్వేరు చోట్ల బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 15 మంది గాయపడ్డారు. వంగర మండలం కస్తూర్బా విద్యాలయం ఆవరణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది గాయపడ్డారు. జాతీయ రహదారిపై కోటబొమ్మాళి మండలం గుంజిలోవా వద్ద జరిగిన మరో ప్రమాదంలో ఐదుగురు గాయపడ్డారు. ప్రమాదాల్లో గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. వంగర : వంగర కస్తూర్బా విద్యాలయం ఆవరణలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. వంగర నుంచి రాజాం వెళ్తున్న ఆటో కస్తూర్బా పాఠశాల వద్ద రోడ్డు దిగుడుగా ఉండడంతో ఆటో డ్రైవర్ రాంబాబు వేగ నియంత్రణ చేయలేక ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించబోయి అదుపుతప్పి ఆటో తుప్పల్లోకి వెళ్లింది. ఈ ప్రమాదంలో లక్ష్మీపేట గ్రామానికి చెందిన కలమట కీర్తన, కలమట రాంబాబు, ఐటీడీఏ కాలనీకి చెందిన దండాసి సరోజిని, విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండల కేంద్రానికి చెందిన గర్భాపు సింహాచలం, విశాఖపట్నం పరిధి పాతపోస్టాఫీసు ఏరియాకు చెందిన ఇంద్ర ప్రవళిక, ఇంద్ర కొండమ్మ, ఇంద్ర రాంబాబు, బండారు శ్రీను, బండారు ఉమ, బండారు నూకరత్నం గాయపడ్డారు. వీరిలో ఆరేళ్ల చిన్నారి కలమట కీర్తన, గరుగుబిల్లికి చెందిన గర్భాపు సింహాచలంకు తీవ్రంగా గాయాలయ్యూరుు. స్థానిక పీహెచ్సీలో వైద్యాధికారి కొత్తకోట సీతారాం ప్రథమ చికిత్సనందించగా క్షతగాత్రులకు రాజాంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై ఇంకా పోలీసులకు ఫిర్యాదు అందలేదని తెలిసింది. ఐదుగురికి గాయూలు గుంజిలోవా (కోటబొమ్మాళి) : జాతీయ రహదారిపై గుంజిలోవ జంక్షన్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. చల్లవానిపేట జంక్షన్ నుంచి కోటబొమ్మాళి ప్రయాణికులతో వస్తున్న ఆటో గుంజిలోవా జంక్షన్ సమీపంలో గల కల్వర్టు గోడకు ఢీకొని బోల్తా పడటంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ సంఘటనలో జిల్లా రైతు కూలి సంఘం ప్రధాన కార్యదర్శి ఎన్.వెంకటరావుతో పాటు సరియాబొడ్డపాడు గ్రామానికి చెందిన సాప సీతారాం, లక్ష్మీపురం గ్రామానికి చెందిన పెద్దిన లక్ష్మి తీవ్రంగా గాయపడ్డారు. జర్జంగికి చెందిన బగాది రామకృష్ణ, రేగులపాడుకు చెందిన ఆటోడ్రైవర్ రమేష్ స్వల్పంగా గాయపడ్డారు. వీరిని స్థానిక సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఆటో డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వల్ల అదుపుతప్పి ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. ట్రైనీ ఎస్.ఐ పి. మనోహర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
రామభద్రపురం(తెర్లాం రూరల్): జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో గురువారం జరిగిన ప్రమాదాల్లో ఇద్దరు మరణించారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలు... బాడంగి మండలం గజరాయునివలస గ్రామానికి చెందిన నల్లా వెంకటరావు(22), తన తల్లి కళావతి, మరో ఇద్దరితో కలిసి ధాన్యం ఆడించేందుకు నాటు బండిపై రామభద్రపురంలోని రైస్‌మిల్లు వద్దకు వచ్చారు. ధాన్యం మిల్లులో ఆడించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఒడిశా నుంచి రామభద్రపురం మీదుగా విజయనగరం వైపు వెళ్తున్న లారీ స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో నాటుబండిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాటుబండి తోలుతున్న నల్లా వెంకటరావు అక్కడికక్కడే మృతిచెందాడు. తల్లి కళావతికి తీవ్ర గాయాలయ్యాయి. నాటుబండిపై ఉన్న గజరాయునివలస గ్రామానికి చెందిన ఎం.లక్ష్మికి కూడా గాయాలయ్యాయి. సత్యనారాయణ అనే వ్యక్తి సురక్షితంగా బయటపడ్డారు. నాటుబండిని లాగుతున్న రెండు ఎద్దుల్లో ఒకటి ప్రమాదస్థలంలోనే చనిపోయింది. వెంకటరావు మృతిచెందాడని, అతని తల్లి కళావతి తీవ్రంగా గాయపడిందని తెలుసుకున్న గజరాయునివలస గ్రామస్తులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. కుమారుడు మృతిచెందడం, భార్య తీవ్రంగా గాయపడటంతో వెంకటరావు తండ్రి తిరుపతి, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రామభద్రపురం పోలీస్‌స్టేషన్ హెచ్‌సీ బీవీ రమణ సిబ్బందితో వెళ్లి ఘటనాస్థలంలో వివరాలు సేకరించారు. నల్లా కళావతి, ఎం.లక్ష్మిలను చికిత్స కోసం బాడంగి సీహెచ్‌సీకి పంపారు. వెంకటరావు మృతదేహానికి శపంచనామా పూర్తిచేసి పోస్టుమార్టం కోసం బాడంగి సీహెచ్కి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించామని హెచ్‌సీ బీవీ రమణ తెలిపారు. వెంకటరావు మృతిచెందడంతో గజరాయునివలసలో విషాదఛాయలు అలముకున్నాయి. ధాన్యం నూర్పిడి యంత్రం తిరబడి... పదమాయవలస (బలిజిపేటరూరల్): పదమాయవలస గ్రామ సమీపంలో ధాన్యం నూర్పిడి యంత్రం తిరగబడటంతో ఓ వ్యక్తి మరణించాడు. పదమాయవలస గ్రామానికి చెందిన చింతాడ పోలిరాజు(32), మరికొందరు కూలీలు కలిసి పొలాల్లో ధాన్యం నూర్పిడి చేసేందుకు యంత్రంతో కలిసి వెళ్తున్నారు. మార్గమధ్యంలో పొలాల వద్ద మలుపుతిరిగే సమయంలో ఆ యంత్రం అదుపుతప్పి బోల్తాకొట్టింది. దీంతో యంత్రంపై కూర్చున్న కూలీలు కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడిన పోలిరాజు అక్కడికక్కడే మరణించాడు. ఎం.జీవులు, సీహెచ్ సీతయ్య, కృపారావు, రాజారావు, తవుడు, ఎ.కృపారావుకి తీవ్ర గాయాలయ్యాయి. వారిని విజయనగరం తరలించారు. పోలిరాజుకు భార్య, ఒక కుమార్తె, వికలాంగుడైన కుమారుడు ఉన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
కొవ్వూరు రూరల్: కొవ్వూరులో సోమవారం అర్ధరాత్రి జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. వీరిలో ఇద్దరు విద్యార్థులు కాగా ఒకరు ప్రైవేట్ ఉద్యోగి. ప్రమాదాల వివరాలు ఇలా ఉన్నారుు.. విశాఖపట్నంలోని కంచరపాలెం శివలింగపురానికి చెందిన వైరాల అప్పారావు ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్నారు. పుష్కర విధుల్లో భాగంగా ఆయన కొవ్వూరు వచ్చారు. ఈ నేపథ్యంలో తండ్రిని చూసి వెళదామని అతని కుమారుడు వైరాల తరుణ్‌కుమార్ (20) సోమవారం రాజమండ్రిలో మేనత్త ఇంటికి వచ్చాడు. మేనత్త కుమారుడు దిగమర్తి ప్రేమకుమార్ (17)తో కలిసి అర్ధరాత్రి వేళ మోటార్ సైకిల్‌పై రాజమండ్రి రోడ్డు కం రైలు బ్రిడ్జిపై నుంచి కొవ్వూరు వస్తుండగా వెనుక నుంచి అతివేగంగా వస్తున్న కారు వీరిని ఢీకొట్టింది. దీంతో తరుణ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందగా ప్రేమ్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని రాజమండ్రిలో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున మృతిచెందాడు. తరుణ్‌కుమార్ విశాఖలోని గాయత్రి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతుండగా, ప్రేమ్‌కుమార్ శ్రీకాకుళం జిల్లా నరవలోని పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నాడు. బంధువులు కొవ్వూరు చేరుకుని పోస్ట్‌మార్టం అనంతరం తరుణ్ మృతదేహాన్ని కంచరపాలెం తరలించారు. ఒకే కుటుంబానికి ఇద్దరు యువకులు పుష్కర వేళ కన్నుమూయడం వారి కుటుంబాలలో తీరని శోకాన్ని మిగిల్చింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని.. కొవ్వూరుకు చెందిన కంతే సత్యనారాయణ(42) సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఆరికిరేవుల రోడ్డులో వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో సత్యనారాయణ అక్కడికక్కడే మృతిచెందారు. ఆయన స్థానిక ఆంధ్రా సుగర్స్ పరిశ్రమలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య వరలక్ష్మితో పాటు ముగ్గురు కుమారులు ఉన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని వివిధ ప్రాంతా ల్లో శుక్రవారం జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెం దారు. చెన్నై తాంబరం, మాడంబాక్కం సన్నిధి వీధికి చెం దిన రామచంద్రన్ కుమారుడు శరవణన్(26). ఇతని భార్య విష్ణు. శుక్రవారం రాత్రి వలసరవాక్కం అన్భునగర్ 10వ వీధిలో దేవత టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతోం ది. లైట్‌మెన్ శరవణన్‌కు అనుకోని విధంగా విద్యుత్ షాక్ తగిలింది. తీవ్రంగా గాయపడ్డ శరవణన్‌ను విరుదంబాక్కంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే శరవణన్ మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. దీనిపై శరవణన్ తండ్రి కోయంబేడు మార్కెట్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇంజినీరు మృతి: చెన్నై కీళ్కట్టనై తిరువళ్లూర్ నగర్ మెయిన్ రోడ్డుకు చెందిన వ్యక్తి శక్తివేల్(29). సంవత్సరం కిందట వివాహమైంది. చెన్నై తరమణిలోని ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. శక్తివేల్ శనివారం ఉదయం మోటారు సైకిల్‌పై మేడవాక్కం కోవిలంబాక్కం ఎంజీఆర్ నగర్ సమీపంలో వెళుతుండగా వెనుకవైపు వచ్చిన లారీ మోటారు బైకును ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ శక్తివేలును స్థానికులు క్రోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతన్ని పరిశీలించిన వైద్యులు శక్తివేల్ మృతి చెందినట్టు తెలిపారు. సమాచారం అందుకున్న మౌంట్ ట్రాఫిక్ పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి తప్పించుకున్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. పారిశ్రామిక వేత్త భార్య మృతి: చెన్నై ఓరగడం సెల్వగణపతి ఆలయం వీధికి చెందిన మురళీధరన్ పారిశ్రామిక వేత్త. ఆయన భార్య లలిత(55). ఆమె కొన్ని రోజులుగా సేలంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందింది. శుక్రవారం కుమారునితో కలిసి బెంగళూరు నుంచి చెన్నై వెళ్తున్న వెస్టుకోస్టు రైలులో చెన్నైకి బయలుదేరింది. వేలూరు జిల్లా ఆంబూరు రైల్వే స్టేషన్ సమీపంలో మూత్ర విసర్జన కోసం రెస్టురూమ్‌కు వెళ్లింది. చాలా సమయం అయినప్పటికీ తల్లి తిరిగి రాకపోవడంతో కుమారుడు దిగ్భ్రాంతి చెందాడు. ఆమె కోసం అన్ని చోట్లు గాలించినా రైలులో కనబడలేదు. ఈ క్రమంలో రైలు కాట్పాడికి చేరుకున్న తర్వాత పోలీసులకు లలిత కుమారుడు ఫిర్యాదు చేశాడు. ఆంబూరు వద్ద బాత్ రూమ్‌కు వెళ్లిన లలిత తలుపు వద్దకు వచ్చిన సమయంలో ఎదురు చూడని విధంగా కింద పడి పోవడంతో అదే రైలు కింద పడి మృతి చెందినట్టు తెలిసింది. ఇన్స్పెక్టర్ చెల్లదురై, సబ్ ఇన్స్పెక్టర్ శివకుమార్ లలిత కుమారుడిని తీసుకుని ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లారు. అక్కడ శవంగా పడివున్న తల్లి మృత దేహం చూసి బోరున విలపించారు. లలిత మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని శవ పరీక్ష కోసం ఆంబూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.