వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
Published Sun, Oct 13 2013 3:15 AM | Last Updated on Tue, Aug 28 2018 7:14 PM
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్: రాష్ట్రంలోని వివిధ ప్రాంతా ల్లో శుక్రవారం జరిగిన ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెం దారు. చెన్నై తాంబరం, మాడంబాక్కం సన్నిధి వీధికి చెం దిన రామచంద్రన్ కుమారుడు శరవణన్(26). ఇతని భార్య విష్ణు. శుక్రవారం రాత్రి వలసరవాక్కం అన్భునగర్ 10వ వీధిలో దేవత టీవీ సీరియల్ షూటింగ్ జరుగుతోం ది. లైట్‌మెన్ శరవణన్‌కు అనుకోని విధంగా విద్యుత్ షాక్ తగిలింది. తీవ్రంగా గాయపడ్డ శరవణన్‌ను విరుదంబాక్కంలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే శరవణన్ మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు. దీనిపై శరవణన్ తండ్రి కోయంబేడు మార్కెట్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరు మృతి:
చెన్నై కీళ్‌కట్టనై తిరువళ్లూర్ నగర్ మెయిన్ రోడ్డుకు చెందిన వ్యక్తి శక్తివేల్(29). సంవత్సరం కిందట వివాహమైంది. చెన్నై తరమణిలోని ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. శక్తివేల్ శనివారం ఉదయం మోటారు సైకిల్‌పై మేడవాక్కం కోవిలంబాక్కం ఎంజీఆర్ నగర్ సమీపంలో వెళుతుండగా వెనుకవైపు వచ్చిన లారీ మోటారు బైకును ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ శక్తివేలును స్థానికులు క్రోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతన్ని పరిశీలించిన వైద్యులు శక్తివేల్ మృతి చెందినట్టు తెలిపారు. సమాచారం అందుకున్న మౌంట్ ట్రాఫిక్ పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి తప్పించుకున్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.
పారిశ్రామిక వేత్త భార్య మృతి:
చెన్నై ఓరగడం సెల్వగణపతి ఆలయం వీధికి చెందిన మురళీధరన్ పారిశ్రామిక వేత్త. ఆయన భార్య లలిత(55). ఆమె కొన్ని రోజులుగా సేలంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందింది. శుక్రవారం కుమారునితో కలిసి బెంగళూరు నుంచి చెన్నై వెళ్తున్న వెస్టుకోస్టు రైలులో చెన్నైకి బయలుదేరింది. వేలూరు జిల్లా ఆంబూరు రైల్వే స్టేషన్ సమీపంలో మూత్ర విసర్జన కోసం రెస్టురూమ్‌కు వెళ్లింది. చాలా సమయం అయినప్పటికీ తల్లి తిరిగి రాకపోవడంతో కుమారుడు దిగ్భ్రాంతి చెందాడు. ఆమె కోసం అన్ని చోట్లు గాలించినా రైలులో కనబడలేదు. ఈ క్రమంలో రైలు కాట్పాడికి చేరుకున్న తర్వాత పోలీసులకు లలిత కుమారుడు ఫిర్యాదు చేశాడు. ఆంబూరు వద్ద బాత్ రూమ్‌కు వెళ్లిన లలిత తలుపు వద్దకు వచ్చిన సమయంలో ఎదురు చూడని విధంగా కింద పడి పోవడంతో అదే రైలు కింద పడి మృతి చెందినట్టు తెలిసింది. ఇన్‌స్పెక్టర్ చెల్లదురై, సబ్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్ లలిత కుమారుడిని తీసుకుని ప్రమాదం జరిగిన స్థలానికి వెళ్లారు. అక్కడ శవంగా పడివున్న తల్లి మృత దేహం చూసి బోరున విలపించారు. లలిత మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని శవ పరీక్ష కోసం ఆంబూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Advertisement