టూరిస్టు బస్సు కారు ఢీ ముగ్గురు మృతి
టూరిస్టు బస్సు కారు ఢీ ముగ్గురు మృతి
Published Sun, Nov 27 2016 10:35 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM
- బస్సును ఢీకొన్నకారు
- ముగ్గురు యువకుల మృతి
- మేట్టూరుపాళయంలో ఘటన
టీనగర్: మేట్టుపాళయం శనివారం రాత్రి టూరిస్టు బస్సుపై కారు ఢీకొన్న ప్రమాదంలో కోయంబత్తూరుకు చెందిన ముగ్గురు యువకులు మృతిచెందారు. కేరళ రాష్ట్రం మూనార్‌లోగల అడిమాలిలో ఫాతిమా మాతా బాలికల మహోన్నత పాఠశాల వుంది. ఈ పాఠశాల నుంచి గత 24వ తేదీ రాత్రి రెండు బస్సులలో మైసూరుకు విహారయాత్రగా బయలుదేరారు. టీచర్లు జెస్సిజోసెఫ్ (38), రెజిమోల్ మేథ్యూ (30), అంబాలిజోస్ (50), సింధుసినో (40) ఆధ్వర్యంలో 100 విద్యార్థినులు వెళ్లారు. మైసూరు, ఊటి ప్రాంతాలలో పర్యటించి శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఊటీ నుంచి మూనార్‌కు తిరిగివస్తున్నారు.
అర్థరాత్రి 12.30 గంటల సమయంలో మేట్టుపాళయం, అన్నూరు రోడ్డులో ముందు వెళుతున్న బస్సును కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కోవైకు చె ందిన ముత్తు (21), వినీత్ (21), కరణ్ (21) అనే ముగ్గురు మృతిచెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన వినయ్ ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నాడు. ఈ సమాచారం అందుకున్న మేట్టుపాళయం పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మేట్టుపాళయం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు.రైలు ఢీకొని విద్యార్థి మృతి: పెరంబూరులో రైలు ఢీకొనడంతో విద్యార్థి మృతిచెందాడు. చెన్నై, ఐనావరం చెల్లియమ్మన్ కోవిల్ వీథికి చెందిన వ్యక్తి రవి. ఇతని కుమారుడు అరవింద్ (18). ఇతను ముగప్పేర్‌లోగల ఒక ప్రైవేటు కళాశాలలో బిఎస్‌సి రెండవ ఏడాది చదువుతూ వచ్చాడు.
శనివారం సాయింత్రం పెరంబూర్ క్యారేజ్ రైల్వేస్టేషన్- వర్కుషాపు మధ్య గల పట్టాలను దాటేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఆవడి నుంచి సెంట్రల్ వైపుగా వస్తున్న విద్యుత్ రైలు అతన్ని ఢీకొంది. దీంతో అరవింద్ అక్కడికక్కడే మృతిచెందాడు. దీనిగురించి సమాచారం అందగానే పెరంబూర్ రైల్వే పోలీసులు సంఘటనా స్థలం చేరుకున్నారు. అరవింద్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని చెన్నై కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం కోసం పంపారు. దీనిగురించి పెరంబూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
Advertisement