
‘ఔటర్’పై ప్రమాదం.. ముగ్గురి దుర్మరణం
హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డుపై గురువారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఇరువురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన ఔటర్ రింగ్ రోడ్డు టోల్‌ప్లాజాకు కిలోమీటర్ దూరంలో ఘనపూర్ వద్ద చోటుచేసుకుంది. హయత్‌నగర్‌కు చెందిన వల్లవోజు కార్తీక్ (38), మర్రి తిరుమలేశ్(34), కె. నర్సింగ్‌రావు (38) కె. బల్‌రామ్, రఘులు మారుతి జెన్ (ఏపీ10ఎల్ 6556) కారులో ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు బయలుదేరి సాయంత్రం అదే కారులో తిరుగు పయన మయ్యారు. మార్గమధ్యలో మండలంలోని ఔటర్‌రింగ్‌పై వారు పయనిస్తున్న కారును వెనుక నుంచి మరో కారు (ఏపీ10బీఈ 6607) అతి వేగంగా ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాల పాలైన కార్తీక్, తిరుమలేశ్, కె.నర్సింగ్‌రావులు అక్కడికక్కడే మృతి చెందారు. జెన్ కారు డ్రైవర్ బల్‌రామ్, రఘులకు గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన వారి భౌతిక కాయాలను నగరంలోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఢీకొట్టిన కారులో పరిటాల రవిచంద్ర అనే ఒకే వ్యక్తి ఉన్నట్లు తెలిపారు.