మధురవాడ(విశాఖపట్టణం జిల్లా): వేగంగా వెళ్తున్న లారీ, కారు ఢీ కొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున విశాఖ జిల్లా మధురవాడలోని ఓజోన్‌వ్యాలీ సమీపంలో జరిగింది. ఈ ఘటనలో రెండు వాహనాలు ఢీ కొనడంతో ఓ మహిళ సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.