car - lorry
-
కుటుంబం విధివశం
సాక్షి, బళ్లారి: రాయచూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు, వారి ఇద్దరు కూతుర్లు ప్రాణాలు కోల్పోయారు. కారు–లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ విషాదం సంభవించింది. సింధనూరు తాలూకా జవళగెరె సమీపంలోని బాలయ్య క్యాంపు వద్ద సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా మధ్యప్రదేశ్‌కు చెందిన వారు బెంగళూరు నుంచి కారు (టీఎస్–08 హెచ్‌జీ–5584)లో హైదరాబాద్‌కు వెళుతున్నారు. ఎదురుగా తెలంగాణ వైపు నుంచి సింధనూరు వైపు వస్తున్న లారీ (ఏపీ–21 వై–6498) ఢీకొంది. ఘటనా స్థలంలోనే కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలతో పాటు ఇద్దరు చిన్నారులు కూడా మరణించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా రోడ్డు రక్తమోడింది. కారులోని నలుగురూ మరణించారు. మృతులు ప్రదీప్ (35), పూరి్ణమ (30), వీరి కూతుళ్లు జతిన్ (12), మాయిన్(7). స్థానిక సీఐ ఉమేష్ కాంబ్లె, బళగానూరు ఎస్ఐ వీరేష్ సిబ్బందితో లారీలోకి దూసుకుపోయిన కారును పొక్లెయినర్‌తో బయటకు లాగి మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. వాహనాల డ్రైవర్ల నిద్రమత్తే ప్రమాదానికి కారణమనే అనుమానం ఉంది. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. (చదవండి: సారీ..రీచార్జ్‌కు డబ్బుల్లేవు) -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
దిలావర్పూర్(నిర్మల్): దిలావర్పూర్ పాత బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన శేఖ్ సలీం(25), నసీరొద్దీన్(42) దుర్మరణం పాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాలివీ.. మహారాష్ట్రలోని ధర్మాబాద్ నుంచి ఎడ్లబండి చక్రాలను బొలెరో వ్యాన్‌లో వేసుకుని ఆసిఫాబాద్‌లోని ఓ షాపులో విక్రయించేందుకు డ్రైవర్ శేక్ సలీంతోపాటు అతనికి తోడుగా నసీరొద్దీన్లు బయల్దేరారు. ఉదయం ఆరు గంటల సమయంలో దిలావర్పూర్ పాతబస్టాండ్ దాటాక రోడ్డు పక్కనే ఉన్న భారీ క్రేన్‌ను తప్పించబోయి వాహనం అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. రెండు వాహనాలు బలంగా ఢీకొనడంతో బొలేరో డ్రైవర్ శేక్ సలీంతోపాటు పక్కనే కూర్చున్న నసీరొద్దీన్ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. నసీరొద్దీన్ మృతదేహం రోడ్డుపై ఎగిరి పడగా డ్రైవర్ సలీం మృతదేహం వాహనంలో ఇరుక్కుపోయింది. లారీడ్రైవర్ అక్కడి నుంచి పరారై స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. సమాచారం తెలుసుకున్న నిర్మల్ డీఎస్పీ మనోహర్‌రెడ్డి, రూరల్‌సీఐ జీవన్‌రెడ్డి, దిలావర్పూర్ ఎస్సై హరిబాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. నుజ్జునుజ్జు అయిన వాహనం ముందు భాగంలో డ్రైవర్ సలీం మృతదేహం ఇరుక్కుపోగా పోలీసులు బయటకు తీశారు. అనంతరం పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు కారణమైన భారీ క్రేన్ దిలావర్పూర్ పాత బస్టాండ్ సమీపంలో నిర్మల్, భైంసా రహదారిపై సోమవారం హైదరాబాద్‌కు వెళ్తున్న భారీ క్రేన్ పాడైపోవడంతో రోడ్డుపక్కనే ఉంచారు. మరమ్మతుల కోసం టెక్నీషియన్ రాకపోవడంతో మంగళవారం తెల్లజామువారు వరకు క్రేన్ అక్కడే ఉండిపోయింది. అత్యంత రద్దీగా ఉండే రోడ్డుపై ఎలాంటి సూచికలు లేకుండా భారీ క్రేన్‌ను నిలిపి ఉంచడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. దీంతో క్రేన్ డ్రైవర్‌ను సైతం అదుపులోకి తీసుకున్నారు. -
ఫ్లైయాష్ ట్యాంకర్ – కారు ఢీ
బద్వేలుఅర్బన్/గోపవరం : బద్వేలు–నెల్లూరు జాతీయ రహదారిలోని గోపవరం మండల చెక్‌పోస్టు సమీపంలో శనివారం ఫ్లైయాష్ ట్యాంకర్– కారు ఢీ కొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. పట్టణంలోని సురేంద్రనగర్‌కు చెందిన కె.విజయలక్ష్మి(55) కడపలోని అరవింద్‌నగర్‌లో నివసించే తన సోదరుడైన (పెదనాన్న కుమారుడు) చలమల రమేష్‌బాబు రెడ్డి (45) భార్య మమతతో కలిసి శుక్రవారం సాయంత్రం నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగే ఓ శుభకార్యానికి వెళ్లారు. అదే శుభకార్యానికి శనివారం ఉదయం రమేష్‌బాబు రెడ్డి కూడా కడప నుంచి బయలుదేరి వెళ్లారు. శుభకార్యం ముగిసిన అనంతరం అక్కడే భోజనం చేసుకుని కారులో బద్వేలుకు బయలుదేరారు. ఈ క్రమంలో గోపవరం మండలంలోని ద్వారక కంకరమిల్లు–చెక్‌పోస్టు మధ్యలో తాడిపత్రి నుంచి నెల్లూరుకు వెళ్తున్న ట్యాంకర్ ఎదురుగా వస్తున్న కారు ముందుభాగంలో ఢీ కొనడంతో విజయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన రమేష్‌బాబు రెడ్డిని, అతని భార్య మమతను ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రమేష్‌రెడ్డి మృతి చెందాడు. తీవ్ర గాయాలపాలైన మమతను మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న రూరల్ పోలీసులు ప్రమాదానికి కారణమైన ట్యాంకర్‌ను స్టేషన్‌కు తరలించి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎమ్మెల్సీ నివాళి శనివారం గోపవరం మండల చెక్‌పోస్టు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విజయలక్ష్మి స్థానిక వైఎస్సార్ సీపీ నాయకుడు యద్దారెడ్డికి వదినతో పాటు ఆర్టీసీ ఎన్ఎంయూ డిపో అధ్యక్షుడు చిన్నపురెడ్డి భార్య కావడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య సురేంద్రనగర్‌లోని వారి ఇంటి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
-
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
మధురవాడ(విశాఖపట్టణం జిల్లా): వేగంగా వెళ్తున్న లారీ, కారు ఢీ కొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున విశాఖ జిల్లా మధురవాడలోని ఓజోన్‌వ్యాలీ సమీపంలో జరిగింది. ఈ ఘటనలో రెండు వాహనాలు ఢీ కొనడంతో ఓ మహిళ సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక కేజీహెచ్ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందిస్తున్నారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.