రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి | Three died in road accidents | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

Published Mon, Mar 30 2015 3:34 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Three died in road accidents

సూర్యాపేట రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ము గ్గురు మృతిచెందంగా, మరో 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జిల్లాలోని సూ ర్యాపేట, నార్కట్‌పల్లి, వలిగొండ మండలాల పరిధిలో చోటు చేసుకున్న ఘటనల వివరాలు.. ఆది వారం నకిరేకల్ నుంచి సూర్యాపేట వైపు ప్రయాణికులతో ఆటో బయలుదేరింది. రాయినిగూడెం గ్రామం వద్దకు రాగానే ప్రయాణికులు దిగేందుకు డ్రైవర్ ఆటో ను రోడ్డు పక్కకు నిలుపుతున్నాడు. ఈ క్రమంలో హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోబోల్తా కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్న 11 మందికి స్వల్ప గాయాలు కాగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
 
 ఇదే క్రమంలో మరో కారు వెనుకాల నుంచి వస్తున్న కారు స్వల్పంగా ఆటోను ఢీకొట్టింది. మొదటగా ఆటోను ఢీకొట్టిన డ్రైవర్ కారు అక్కడే వదిలి పరారయ్యారు. గాయపడిన వారిని 108లో సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు.  గాయపడిన వారిలో పెండ్ర ఆదమ్మ చికిత్స పొందుతూ మృతిచెందింది. దాసరి తరుణ్(టేకుమట్ల) పరిస్థితి విషమంగా ఉంది.  చింతపల్లి వెంకమ్మ(టేకుమట్ల), మక్కా రమణ(టేకుమట్ల), వీడాల వరలక్ష్మి (సూర్యాపే ట), తంతోజు రమణాచారీ, జానకమ్మ, భవిత, భరత్‌చంద్రాచారీ(జాజిరెడ్డిగూడెం), ఎర్రబోయిన అంజమ్మ (కేతేపల్లి), పరుశబోయిన పూలమ్మ(టేకుమట్ల), అక్కేనపల్లి సోమయ్య(కేతేపల్లి), డ్రైవర్ రాజవరపు సతీష్ (మిర్యాలగూడ) గాయాలయ్యాయి. వీడాల వరలక్ష్మి ఫి ర్యాదు మేరకు కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పవన్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
 
 గుర్తుతెలియని వాహనం ఢీకొని..
 మండలంలోని చిన్నతుమ్మలగూడెం గ్రా మానికి చెందిన ఆవుల రామకృష్ణ (23)శనివారం రాత్రి తన గ్రామం నుంచి నార్కట్‌పల్లికి బైక్‌పై వస్తుండగా మాధవ యా డవెల్లి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో రామకృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి.అతడిని హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు కాగా, రామకృష్ణ  నేత్రాలను నిమ్స్ ఆస్పత్రిలో దానం చేసినట్లు కుటుంబీకులు తెలిపారు.
 
 టాటాఏస్ ఢీకొట్టడంతో..
 వలిగొండ మండలంలోని నాగారం గ్రామానికి చెందిన గుంజ గండయ్య(70) రామన్నపేట మండలం ఇంద్రపాలనగరానికి సైకిల్‌పై వెళ్తున్నాడు. ఇదే సమయంలో వలిగొండ వైపు వస్తున్న టాటా ఏస్ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలై అత ను అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీ సులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం రామన్నపేట ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుమారుడు ఎల్లయ్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ మంజునాథ్‌రెడ్డి  కేసు నమోదు చేశారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement