అనంతపురం :జిల్లాలోని శింగనమల మండల కేంద్రంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి అనుమానాస్పద స్థితిలో గురువారం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఎస్‌కేడీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న జగపతి(15) అనే విద్యార్థి తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని చనిపోయాడు.
అయితే విద్యార్థి వీపుపై గాయాలు ఉండటంతో ఎవరైనా హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేనుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.