అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా అంతటా గ్రీష్మతాపం కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయిలో నమోదవుతున్నాయి. బుధవారం శింగనమల మండలం తరిమెలలో గరిష్టంగా 41.6 డిగ్రీలు, పామిడి 41.5 డిగ్రీలు, గుంతకల్లు 40.9 డిగ్రీలు, చెన్నేకొత్తపల్లి 40.4 డిగ్రీలు, పుట్లూరు 40.2 డిగ్రీలు, యల్లనూరు 40.1 డిగ్రీలు, పుట్టపర్తి 40.1 డిగ్రీలు, యాడికి 40 డిగ్రీలు నమోదు కాగా తక్కిన మండలాల్లో 37 నుంచి 39 డిగ్రీల మధ్య కొనసాగింది.
కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 26 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం ఉదయం 52 నుంచి 82, మధ్యాహ్నం 14 నుంచి 24 శాతం మధ్య రికార్డయింది. గంటకు 6 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఉక్కపోత ఎక్కువ కావడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఏప్రిల్, మే నెలలు ఉండటంతో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొనసాగుతోన్న గ్రీష్మతాపం
Published Wed, Mar 22 2017 11:54 PM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM
Advertisement