tharimela
-
సూరీడి సెగలు
అనంతపురం అగ్రికల్చర్ : సూరీడు సెగలు కక్కుతున్నాడు. అధిక ఉష్ణోగ్రతలతో ‘అనంత’ జనం అల్లాడుతున్నారు. గురువారం శింగనమల మండలం తరిమెలలో 43.7 డిగ్రీలు గరిష్టం నమోదు కాగా... పామిడి 42.5 డిగ్రీలు, రాప్తాడు, పెద్దపప్పూరు 42.3 డిగ్రీలు, యల్లనూరు, బుక్కరాయసముద్రం 42.1 డిగ్రీలు, తనకల్లు 42 డిగ్రీలు, శింగనమల 41.9 డిగ్రీలు, బత్తలపల్లి 41.7 డిగ్రీలు, పెనుకొండ 41.6 డిగ్రీలు, బెళుగుప్ప 41.5 డిగ్రీలు, తాడిమర్రి 41.4 డిగ్రీలు, నార్పల 41.3 డిగ్రీలు, అనంతపురం 41.2 డిగ్రీలు, రాయదుర్గం, కూడేరు 41.2 డిగ్రీలు, గార్లదిన్నె 41.1 డిగ్రీలు, ఉరవకొండ, పుట్టపర్తి 40.5 డిగ్రీలు, ధర్మవరం 40.3 డిగ్రీలు, గుత్తి 40.2 డిగ్రీలు, కదిరి 40.1 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 38 నుంచి 40 డిగ్రీల మధ్య కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 28 డిగ్రీల మధ్య కొనసాగాయి. గాలిలో తేమశాతం ఉదయం 48 నుంచి 78, మధ్యాహ్నం 16 నుంచి 26 శాతం మధ్య రికార్డయ్యింది. గాలులు గంటకు 6 నుంచి 15 కిలో మీటర్ల వేగంతో వీచాయి. -
కొనసాగుతోన్న వేసవితాపం
అనంతపురం అగ్రికల్చర్ : చెన్నేకొత్తపల్లి 42.6 డిగ్రీలు, పుట్టపర్తి 42.1 డిగ్రీలు, యల్లనూరు 41.8 డిగ్రీలు, కూడేరు 41.7 డిగ్రీలు, పుట్లూరు 41.6 డిగ్రీలు, బుక్కపట్టణం 41.4 డిగ్రీలు, పామిడి 41.4 డిగ్రీలు, ఉరవకొండ 40.6 డిగ్రీలు, గుంతకల్లు 40.5 డిగ్రీలు, అనంతపురం, గుత్తి, కళ్యాణదుర్గం, ధర్మవరం 40.3 డిగ్రీలు నమోదైంది. మిగతా మండలాల్లో 38 నుంచి 40 డిగ్రీల మధ్య కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 26 డిగ్రీలు నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 48 నుంచి 75, మధ్యాహ్నం 14 నుంచి 23 శాతం మధ్య రికార్డయింది. గంటకు 6 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. -
తరిమెలలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత
అనంతపురం అగ్రికల్చర్ : సూర్యుడు అగ్గి రాజేస్తున్నాడు. ఉక్కపోత, వడగాల్పులతో జనం సతమతమవుతున్నారు. సోమవారం శింగనమల మండలం తరిమెలలో 44.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. చెన్నేకొత్తపల్లి 43.6 డిగ్రీలు, పామిడి 43.4 డిగ్రీలు, తాడిమర్రి 43.1 డిగ్రీలు, యల్లనూరు 43.1 డిగ్రీలు, బుక్కరాయసముద్రం 42.8 డిగ్రీలు, పుట్లూరు 42.8 డిగ్రీలు, శింగనమల 42.7 డిగ్రీలు, యాడికి 42.3 డిగ్రీలు, పెద్దవడుగూరు 42.4 డిగ్రీలు, పుట్టపర్తి 41.6 డిగ్రీలు, ధర్మవరం 41.4 డిగ్రీలు, కళ్యాణదుర్గం 41 డిగ్రీలు, అనంతపురం 40.9 డిగ్రీలు, కదిరి 40.8 డిగ్రీలు, గుంతకల్లు 40.7 డిగ్రీలు, గుత్తి 40.5 డిగ్రీలు, పెనుకొండ 40.3 డిగ్రీలు, ఉరవకొండ 40.1 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 39, 40 డిగ్రీల మధ్య కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 28 డిగ్రీల వరకు నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం ఉదయం 45 నుంచి 75, మధ్యాహ్నం 14 నుంచి 24 శాతం మధ్య రికార్డయింది. కనేకల్లులో 15 మి.మీ వర్షం : ఆదివారం అర్థరాత్రి పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు పడ్డాయి. కనేకల్లులో 15 మి.మీ, యాడికి 13 మి.మీ, కూడేరు 11 మి.మీ, డి.హిరేహాల్ 5 మి.మీతో పాటు గుంతకల్లు, పెద్దవడుగూరు, బెళుగుప్ప, ఉరవకొండ, యాడికి, గార్లదిన్నె, అమరాపురం, బొమ్మనహాల్, గుత్తి మండలాల్లో చిరుజల్లులు కురిశాయి. -
కొనసాగుతోన్న గ్రీష్మతాపం
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా అంతటా గ్రీష్మతాపం కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు గరిష్టస్థాయిలో నమోదవుతున్నాయి. బుధవారం శింగనమల మండలం తరిమెలలో గరిష్టంగా 41.6 డిగ్రీలు, పామిడి 41.5 డిగ్రీలు, గుంతకల్లు 40.9 డిగ్రీలు, చెన్నేకొత్తపల్లి 40.4 డిగ్రీలు, పుట్లూరు 40.2 డిగ్రీలు, యల్లనూరు 40.1 డిగ్రీలు, పుట్టపర్తి 40.1 డిగ్రీలు, యాడికి 40 డిగ్రీలు నమోదు కాగా తక్కిన మండలాల్లో 37 నుంచి 39 డిగ్రీల మధ్య కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 26 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం ఉదయం 52 నుంచి 82, మధ్యాహ్నం 14 నుంచి 24 శాతం మధ్య రికార్డయింది. గంటకు 6 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఉక్కపోత ఎక్కువ కావడంతో జనం ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఏప్రిల్, మే నెలలు ఉండటంతో జిల్లా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.