వేసవితాపం కొనసాగుతోంది. మంగళవారం శింగనమల మండలం తరిమెలలో 44.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
అనంతపురం అగ్రికల్చర్ : చెన్నేకొత్తపల్లి 42.6 డిగ్రీలు, పుట్టపర్తి 42.1 డిగ్రీలు, యల్లనూరు 41.8 డిగ్రీలు, కూడేరు 41.7 డిగ్రీలు, పుట్లూరు 41.6 డిగ్రీలు, బుక్కపట్టణం 41.4 డిగ్రీలు, పామిడి 41.4 డిగ్రీలు, ఉరవకొండ 40.6 డిగ్రీలు, గుంతకల్లు 40.5 డిగ్రీలు, అనంతపురం, గుత్తి, కళ్యాణదుర్గం, ధర్మవరం 40.3 డిగ్రీలు నమోదైంది.
మిగతా మండలాల్లో 38 నుంచి 40 డిగ్రీల మధ్య కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 26 డిగ్రీలు నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 48 నుంచి 75, మధ్యాహ్నం 14 నుంచి 23 శాతం మధ్య రికార్డయింది. గంటకు 6 నుంచి 16 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.