అనంతపురం అగ్రికల్చర్ : సూర్యుడు అగ్గి రాజేస్తున్నాడు. ఉక్కపోత, వడగాల్పులతో జనం సతమతమవుతున్నారు. సోమవారం శింగనమల మండలం తరిమెలలో 44.7 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. చెన్నేకొత్తపల్లి 43.6 డిగ్రీలు, పామిడి 43.4 డిగ్రీలు, తాడిమర్రి 43.1 డిగ్రీలు, యల్లనూరు 43.1 డిగ్రీలు, బుక్కరాయసముద్రం 42.8 డిగ్రీలు, పుట్లూరు 42.8 డిగ్రీలు, శింగనమల 42.7 డిగ్రీలు, యాడికి 42.3 డిగ్రీలు, పెద్దవడుగూరు 42.4 డిగ్రీలు, పుట్టపర్తి 41.6 డిగ్రీలు, ధర్మవరం 41.4 డిగ్రీలు, కళ్యాణదుర్గం 41 డిగ్రీలు, అనంతపురం 40.9 డిగ్రీలు, కదిరి 40.8 డిగ్రీలు, గుంతకల్లు 40.7 డిగ్రీలు, గుత్తి 40.5 డిగ్రీలు, పెనుకొండ 40.3 డిగ్రీలు, ఉరవకొండ 40.1 డిగ్రీలు నమోదు కాగా మిగతా మండలాల్లో 39, 40 డిగ్రీల మధ్య కొనసాగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 22 నుంచి 28 డిగ్రీల వరకు నమోదయ్యాయి. గాలిలో తేమ శాతం ఉదయం 45 నుంచి 75, మధ్యాహ్నం 14 నుంచి 24 శాతం మధ్య
రికార్డయింది.
కనేకల్లులో 15 మి.మీ వర్షం : ఆదివారం అర్థరాత్రి పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు పడ్డాయి. కనేకల్లులో 15 మి.మీ, యాడికి 13 మి.మీ, కూడేరు 11 మి.మీ, డి.హిరేహాల్ 5 మి.మీతో పాటు గుంతకల్లు, పెద్దవడుగూరు, బెళుగుప్ప, ఉరవకొండ, యాడికి, గార్లదిన్నె, అమరాపురం, బొమ్మనహాల్, గుత్తి మండలాల్లో చిరుజల్లులు కురిశాయి.
తరిమెలలో 44.7 డిగ్రీల ఉష్ణోగ్రత
Published Tue, Apr 4 2017 1:34 AM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM
Advertisement