శింగనమల : శింగనమల మండలంలోని మరువకొమ్మక్రాస్, లోలూరు క్రాస్ వద్ద ఎస్పీ ఆదేశాల మేరుకు ఏడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ హమీద్‌ఖాన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అక్కడ ఏర్పాటు చేసిన కెమెరాల వల్ల క్రైం ఘటనలు నియంత్రణలో వస్తాయని చెప్పారు. కెమెరాలను జియో ట్యాగింగ్ చేశామన్నారు.దీని ద్వారా పోలీస్‌ల సెల్‌లకు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడమే కాకుండా లైవ్‌లో కూడా పర్యవేక్షించొచ్చన్నారు. ఈ సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ ఆదిశేషు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.