ఎత్తు.. చిత్తు.. | election plans | Sakshi
Sakshi News home page

ఎత్తు.. చిత్తు..

Published Mon, Mar 3 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 AM

ఎత్తు.. చిత్తు..

ఎత్తు.. చిత్తు..

 అనంతపురం :
 సార్వత్రిక ఎన్నికల్లో శింగనమల నియోజకవర్గ ప్రజలను కనికట్టు చేసి, లబ్ధి పొందేందుకు మాజీ మంత్రి శైలజానాథ్ వేసిన ఎత్తులు చిత్తయ్యాయి. జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాన్ని రూ.40 కోట్లతో విస్తరిస్తే.. శింగనమల నియోజకవర్గంలోని 73 గ్రామాలకు తాగునీళ్లు అందించవచ్చునని గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యూఎస్) అధికారులు ప్రతిపాదించారు.

 

ఆ ప్రతిపాదనలను పక్కన పెట్టి.. రూ.150 కోట్లతో శింగనమల నియోజకవర్గానికి ప్రత్యేక పథకాన్ని 2013 నవంబర్ 25న అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఒత్తిడి చేసి శైలజానాథ్ మంజూరు చేయించుకున్నారు. అయితే జేసీ నాగిరెడ్డి పథకాన్ని ఇటీవల తనిఖీ చేసిన ఆర్‌డబ్ల్యూఎస్ ఈఎన్‌సీ చక్రపాణి.. శింగనమల నియోజకవర్గానికి ప్రత్యేక నీటి పథకాన్ని చేపట్టడమంటే రూ.110 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేయడమేనని ప్రభుత్వానికి నివేదించారు. ఆ ప్రతిపాదనతో శింగనమల తాగునీటి పథకం రద్దు చేయాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. ఇది మాజీ మంత్రి శైలజానాథ్‌ను ఇరకాటంలోకి నెట్టింది. వివరాల్లోకి వెళితే..  తాడిపత్రి, గుంతకల్లు, శింగనమల నియోజకవర్గాల్లోని 561 గ్రామాలు, రెండు మున్సిపాల్టీల్లోని ప్రజలకు రోజుకు తలసరి 70 లీటర్ల నీటిని అందించేందుకు రూ.508 కోట్ల వ్యయంతో జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాన్ని 2008లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేశారు. ఈ పథకానికి వైఎస్సార్ జిల్లాలోని గండికోట జలాశయం నుంచి  మూడు టీఎంసీల నీటిని కేటాయించారు. ఇప్పటిదాకా ఈ పథకంలో రూ.396.16 కోట్ల విలువైన పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వం మూడేళ్లుగా బిల్లులను చెల్లించకపోవడం వల్ల కాంట్రాక్టర్లు పనులను ఆపేశారు. రూ.396.16 కోట్లను ఖర్చు చేసినా ఒక్క గ్రామానికి కూడా నీళ్లందించలేని దుస్థితి నెలకొంది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement