సింగనమల (అనంతపురం) : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్తో ప్రతిపక్షం పిలుపునిచ్చిన బంద్ శనివారం దిగ్విజయవంతంగా కొనసాగుతోంది. అనంతపురం జిల్లా సింగనమలలో వైఎస్సార్సీపీ జిల్లా నాయకులు ఆలూరు సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా సాగుతోంది. కాగా సింగనమలలో బంద్‌లో పాల్గొంటున్న వైఎస్సార్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. 100 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.