తరిమెలలో విషాదం | young farmer suicide in ananthpur distirict | Sakshi
Sakshi News home page

తరిమెలలో విషాదం

Published Tue, Oct 6 2015 8:53 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

తరిమెలలో విషాదం - Sakshi

తరిమెలలో విషాదం

అనంతపురం: అనంతపురం జిల్లా సింగనమల మండలంలో విషాదం నెలకొంది. మండలంలోని తరిమెలకు చెందిన దివాకర్ అనే యువ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన సోమవారం అర్థరాత్రి చోటు చేసుకుంది.  వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన దివాకర్(27) నాలుగేళ్లుగా ఆరెకరాల భూమి కౌలుకు తీసుకుని వేరుశెనగ, పత్తి పంటలను సాగు చేస్తున్నాడు. వరుసగా పంటలు దెబ్బ తినడంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాక రూ.4లక్షల వరకు అప్పులు మిగిలాయి. దీనిపై మనోవేదనతో ఉన్న దివాకర్ సోమవారం అర్థరాత్రి గ్రామంలోని వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి కట్టుకున్న లుంగీతో ఉరి వేసుకున్నాడు. మంగళవారం ఉదయం గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. దివాకర్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. ఏఎస్‌ఐ ఇక్బాల్ భాషా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement